Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది కూరలో కరివేపాకు కనిపించగానే తీసి తినకుండా పక్కకు పెడతారు. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు తెలియక ఇలా చేస్తారు. కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...
ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- కరివేపాకు ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి ని సరఫరా చేస్తాయి.
ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది.
- కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి.
కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
- కరివేపాకు మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది.
- హెల్త్ లైన్ నివేదిక ప్రకారం.. కరివేపాకులో మెదడుతో సహా మన నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి.
- కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.
- కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో దానితో స్నానం చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారమవుతుంది.