Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వల్ల అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. సాధ్యమైనంతరకు ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమై ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోంలో చెయ్యాల్సినవి ఏంటీ? అసలే ఎండా కాలం... మరి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
సమయానికి ఆహారం: ముందుగా సెపరేట్ గదిని ఎంపిక చేసుకోవాలి. అందులో ఉక్కపోత లేకుండా చూసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. పనిలో పడి ఆహారం తీసుకోవడం మరిచిపోవద్దు. తినే ఆహారం లైట్‌గా ఉండాలి. ఎక్కువగా కారం, పులుపు, నూనె వేపుళ్లు తీసుకోరాదు. అలా తీసుకుంటే మెదడు చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉంది.
కూర్చునే చోటు: నిద్ర విషయంలో కూడా ఆలస్యం చేయవద్దు. కూర్చునే సీటింగ్, లాప్ టాప్ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా ల్యాప్ టాప్ ఉన్నప్పటికీ ఇష్టం వచ్చినట్టు బీన్ బ్యాగ్స్, లేదా నేలపై కూర్చొని పనిచేస్తే ఎక్కువ సేపు కూర్చోలేరు. అందుకే తప్పకుండా బల్లపై పెట్టుకొని, కుర్చీలో కూర్చొని పనిచేయాలి. లేకపోతే అది పని మీద, మీ కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. పనిచేసే సమయంలో మర్చిపోకుండా మంచి నీళ్ళు తాగండి. అయితే మరీ చల్లటి నీటిని తాగకండి.
టైపింగ్ చేసే సమయంలో: మీ మోచేతుల కంటే కీబోర్డ్ పైకి ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే మాత్రం మెడ వెనుక భాగంలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆకలి తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. బాదం, జీడిపప్పు, వేరు శనగ, పిస్తా, మంచి ఎనర్జీ ఇస్తాయి. వేయించిన బఠానీలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.