Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. వీళ్ళందరకూ వీడియో కాల్స్ తప్పవు. దీని వల్ల కొన్ని ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం...
అవసరం లేనివి వదిలేయండి: మీరు తప్పించుకోలేని కాల్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏమీ చేయలేం. కొన్ని కాల్స్ మీరు తరువాత రికార్డింగ్ వినవచ్చు, లేదా అటెండ్ అవ్వక్కరలేదు అనుకుంటే మాత్రం వాటిని వదిలేయండి. మీరు తప్పని సరిగా వీడియో కాల్లో ఉండవలసిన సందర్భాల్లో అప్పుడప్పుడూ బ్రేక్స్ తీసుకోండి. అప్పుడప్పుడూ వీడియో ఆపేస్తేనే బాగా వినగలుగుతుంటే అదే మాట చెప్పడంలో తప్పు లేదు. అలాగే మీరు మీటింగ్స్ మధ్యలో రూమ్ మారవలసి వస్తే అప్పుడు కూడా వీడియో ఆఫ్ చేసేయండి.
వీడియో ఆఫ్ చేసేయండి: ఇది అన్ని వర్క్ ప్లేసెస్‌లో కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కుదిరితే మాత్రం వీడియో ఆఫ్ చేసేసి కాల్ అటెండ్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మీరు కాల్ వింటూ కూడా ఇంట్లో కొన్ని పనులు చేసుకోగలుగుతారు. అసలు వీడియో కాల్ అవసరం లేకపోతే ఆడియో కాల్ తోనే సరిపోతుంది కదా.. ఆలోచించండి.
కుదిరే సమయం ఎంచుకోండి: మీ మీటింగ్స్ షెడ్యూలింగ్ మీద మీకేమైనా కంట్రోల్ ఉంటే మీకు కుదిరే సమయాల్లోనే వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోండి. అలాగే మీతో పాటూ ఆ కాల్లో ఉండే వారి వీలు కూడా కనుక్కుని షెడ్యూల్ చేసుకుంటే మీకూ వారికీ కూడా హాయిగా ఉంటుంది. ఆ టైమ్ తప్ప మిగిలిన సమయాల్లో వీడియో కాల్స్ అత్యవసరమైతే తప్ప షెడ్యూల్ చేసుకోకండి.
నిపుణులు ఏమంటున్నారంటే: వీడియో మీటింగ్స్ స్త్రీలు, పురుషులకి ఒకే సమయం నడిచినా స్త్రీలు పురుషుల కంటే తక్కువ బ్రేక్స్ తీసుకుంటారని తెలుస్తోంది. పైగా మహిళలకు సెల్ఫ్ ఫోకస్డ్ అటెన్షన్ కూడా ఉంటుందనీ ఈ జూమ్ ఫెటీగ్కి అది కూడా ఓ ముఖ్య కారణమే అనీ నిపుణులు అంటున్నారు. డిస్ప్లే సెట్టింగ్‌లో సెల్ఫ్ వ్యూని టర్న్ ఆఫ్ చేయడం ద్వారా దీన్నించి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే స్క్రీన్ వద్ద నుండి కొంచెం దూరంగా జరగడం, కాల్స్ మధ్యలో కొంత సేపు వీడియో టర్న్ ఆఫ్ చేయడం కూడా హెల్ప్ చేస్తాయని వారి సూచన.