Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాఫీ ఓ మోతాదులో తీసుకుంటే మంచిదే. కానీ అతిగా తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
రోజూ ఉదయం అల్పాహారం తర్వాత, సాయంకాలం తక్కువ గాఢత ఉన్న కాఫీ తాగటం వల్ల హాని కలుగదు. అయితే రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగే వారికి జీర్ణశక్తి తగ్గి పోవడం, ఆకలి లేక పోవడం, గ్యాస్ట్రిక్ అల్సర్, రక్తపోటు, గుండె దడ, నిద్రలేమి, తలనొప్పిలతో పాటు వార్ధక్య లక్షణాలు కూడా త్వరగా కలుగుతాయి.
పిల్లలకు ఎట్టి పరిస్థితులలో కూడా కాఫీని అలవాటు చేయకూడదు. దీనివల్ల వారి పెరుగుదల నిరోధించబడుతుంది.
పరగడుపున తీసుకున్న కాఫీలోని కెఫిన్ జీర్ణకోశం నుంచి రక్తంలోకి చాలా త్వరగా వ్యాపించి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.