Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాలి కాలుష్యం ప్రమాదకరమైనది. అది శాసకోశ సమస్యలు తెస్తుంది. ఊపిరి ఆడనివ్వదు. గొంతులో ఏదో అడ్డుపడుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా గాలి కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, కఫం ఎన్నో సమస్యలొస్తాయి. వీటికి ఇంట్లోనే ఉంటూ... చక్కటి చిట్కాలు పాటించడం ద్వారా చెక్ పెట్టవచ్చు.
తులసి ఆకులు, పూలూ అన్నీ ఔషధ గుణాలతో ఉంటాయి. రోజూ రెండు తులసి ఆకులు తినేయండి. అంతే ఎయిర్ పొల్యూషన్ సమస్య నుంచి మీరు చాలా వరకూ బయటపడతారు. ఆకుల్ని కడిగి, శుభ్రం చేసుకొని తింటే సరిపోతుంది.
మీ చుట్టూ దుమ్ము, దూళి, పొగ లాంటివి ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత కొద్దిగా బెల్లం ముక్క తినండి. ఇది మీ బ్లడ్‌ను క్లీన్ చేస్తుంది. ఇది పొల్యూషన్‌తో వచ్చే అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
దగ్గు ఇబ్బంది పెడుతున్నట్లైతే వెల్లుల్లి తిన్నా మంచిదే. ఓ టేబుల్ స్పూన్ వెన్నలో వెల్లుల్లి రెబ్బల్ని పచ్చడి చేసిన ముద్దను కలపండి. తినేయండి. చేదుగా అనిపించినా గుటుక్కుమనిపించండి. ఆ తర్వాత అరగంటపాటూ నీరు తాగొద్దు. ఇలా రోజూ చేస్తే గొంతులో గరగర దెబ్బకు తగ్గిపోతుంది.
గొంతులో కఫం, ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే, మాటిమాటికీ గొంతు సరిచేసుకుంటూ ఉంటే అప్పుడు నల్ల మిరియాలూ, తేనెను రెడీ చేసుకోవాలి. ఓ చెంచాడు తేనెలో అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి తాగేయండి.
పొడి దగ్గు వస్తూ... కఫం కూడా ఉంటే నల్ల మిరియాలు, తేనెకు తోడు అల్లం కూడా కలపండి. ఈ మూడూ గొంతు దగ్గరకు వెళ్లి అక్కడి వైరస్‌ను చంపేస్తాయి.