Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా... ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. కరోనా రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది.
బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నిషియం, ఫైబర్ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.
మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి బలం వస్తుంది.
కాన్సర్పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్, లూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్, గర్భాశయ కాన్సర్లను తగ్గిస్తుంది.
బొప్పాయి అప్పుడప్పుడూ తింటూ ఉంటే కండ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి.
బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే మంచిదే.
నారింజ, యాపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన స్కిన్ సున్నితంగా, మదువుగా, కోమలంగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.
బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటేనే పై ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.