Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు రోజుకీ టెక్నాలజీ అభివద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగి పోయింది. అలాగే స్మార్ట్ ఫోన్స్‌తో పాటు పిల్లలు లాప్ టాప,్ టాబ్లెట్‌కి బాగా అలవాటు పడ్డారు. ఉద్యోగం చేసే వాళ్ళు వర్క్ ఫ్రం హౌం చేస్తూ స్క్రీన్‌కి అతుక్కుపోతే పిల్లలు ఆన్లైన్ క్లాసులు వల్ల స్క్రీన్లకి దగ్గరయ్యారు. వీటి ప్రభావం మన మీద తీవ్రంగా పడుతుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో స్క్రీన్ టైం ఎక్కువై పోయింది. దాంతో ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. స్క్రీన్లతో ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి. నిజంగా దాని వల్ల మన ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే బ్లూ లైట్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా వచ్చే లైట్ కారణంగా చర్మం రంగు మారడం, కమిలి పోవడం, ముడతలు పడడం లాంటివి సంభవిస్తాయని డెర్మటాలజిస్ట్ చెప్తున్నారు. సాధారణంగా మనం స్క్రీన్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల మన చర్మంపై పది రకాల సమస్యలకు కారణం అవుతుంది. ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా మనకి లైట్ వస్తుంది. అయితే సాధారణంగా ఎలక్ట్రానిక్ డివైస్‌లో ఉండే సాధారణ లైట్స్ వల్ల అంత ప్రమాదం ఏమీ లేదు. బ్లూ లైట్ చర్మంపై పడడం వల్ల ఫొటో ఏజింగ్‌కి కారణం అవుతుందని నిపుణులు అన్నారు. మన చర్మం మూడు గంటల పాటు బ్లూ లైట్‌ని ఫేస్ చేస్తే అంటే ఒక గంట పాటు ఎండలో వుంటే అంత సమస్య కలుగుతుందో అంత సమస్య ఉంటుందని అంటున్నారు. కాబట్టి ప్రమాదాన్ని గమనించి తీరాలి. లేదు అంటే చర్మ సమస్యలు తప్పవు. అలాగే ఈ బ్లూ లైట్ వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ కూడా ఉంటుంది. ఫ్రీరాడికల్స్‌ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
స్మార్ట్ ఫోన్ల వల్ల కేవలం కంటికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే పొరపాటు. ఇటువంటివి మనకి తెలియకుండా ఎన్నో ఇబ్బందులు ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా వస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీలైనంత తక్కువ సేపు స్క్రీన్ ముందు ఉంటే మంచిది. అవసరం లేనప్పుడు వీటిని అవాయిడ్ చేయడం లాంటివి చేయాలి.
నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. అలానే చాలా మంది టీవీలకి, లాప్టాప్కి అలవాటు పడిపోయారు. అయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తీరాలి. చాలా సమస్యలు మనకి తెలియకుండా వ్యాపిస్తుంటాయి. అలానే బ్లూ లైట్ చర్మాన్ని డార్క్‌గా చేస్తుంది. ఇలా మీ చర్మం నల్లగా అయి పోతుంది.
ఎలా బయటపడాలి?
లాక్ డౌన్ కారణంగా పిల్లలు, పెద్దలు కూడా దీనికి దగ్గర అయి పోయారు. దీని కారణంగా మరింత ప్రమాదానికి గురౌతున్నారు. అయితే దీని నుంచి మనం ఎలా బయట పడొచ్చు..? ఎటువంటి పద్ధతులను అనుసరిస్తే ఈ బ్లూ లైక్ మనం దూరంగా ఉండొచ్చో తెలుసుకుందాం..
మీ ఫోన్ లేదా మీ కంప్యూటర్ని ఆన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీ ఫోన్‌ని డార్క్ మోడ్‌లో పెట్టుకోండి. దీని వల్ల బ్రైట్ నెస్ పెద్దగా మీ చర్మం పై పడదు. ఇలా ఈ సింపుల్ టెక్నిక్స్‌ని పాటించారంటే మీ స్కిన్‌కి ఇబ్బంది ఉండదు.
బ్లూ లైట్ వల్ల మీ చర్మానికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు సన్ స్క్రీన్ లోషన్ వాడండి. వాటిలో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఉండేట్టు చూసుకోండి. ఇది బ్లూ లైట్‌ని ఎదుర్కొని బాగా పని చేస్తాయి. బీటా కెరోటిన్, క్యారెట్ రూట్ ఎక్స్ట్రాక్ట్, క్యారెట్ సీడ్ ఆయిల్ లాంటివి కూడా ఉపయోగిస్తే మంచిది. ఇవి మీ చర్మాన్ని రక్షిస్తాయి.
రాత్రి పూట సన్ స్క్రీన్ లాంటి రాసుకోవడం వల్ల కూడా మీకు మంచి కలుగుతుంది దీని వల్ల మీరు డ్యామేజ్ నుంచి బయట పడవచ్చు, విటమిన్ సి, సీరం లాంటివి చర్మంపై అప్లై చేసుకోవడం వల్ల మీకు ఎఫెక్ట్ అవ్వదు. అలానే చర్మం పై గీతలు ముడతలు లాంటివి రావు. కాబట్టి మీరు ఫోన్ బ్రైట్‌నెస్‌ని తగ్గించుకోవడం లేదా డార్క్ మోడ్‌లో పెట్టడం మంచి సన్ స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించడం లాంటివి పాటించవచ్చు.
మాయిశ్చరైజర్‌ని ఉపయోగించే వాళ్ళు గ్లిజరిన్, షీ బట్టర్ ఉండేట్టు చూసుకోండి. అలాగే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయటపడొచ్చు.
ప్రతి రోజూ మీ డైట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. అంటే దానిమ్మ, ద్రాక్ష, విటమిన్ ఈ, విటమిన్ బి3, గ్రీన్ టీ లాంటివి మీ డైట్లో ఉండేట్టు చూసుకోండి.
కాబట్టి ఇకపై కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్ వంటివి వాడేటప్పుడు నేరుగా బ్లూ లైట్ మీద పడకుండా ఉండేటట్టు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు ఆరోగ్యాన్ని... అటు అందాన్ని కాపాడుకోవచ్చు.