Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తిమీర చాలా ఇళ్లలో పెంచుతారు. కానీ పెరట్లోనే, కుండీలోనో పెంచుతారు. కానీ దానికి మట్టి అంటుకుపోతూ ఉంటుంది. మరి మట్టితో పనిలేకుండా ఎలా పెంచాలో తెలుసుకుందాం.
ముందుగా కొన్ని ధనియాలను తీసుకొని వాటిని రెండుగా విడగొట్టాలి. ధనియాలు ముక్కలైతే త్వరగా మొక్కలుగా వస్తాయి.
ఇప్పుడు ఓ గిన్నెలో నిండుగా నీరు నింపాలి.
ఓ ప్లాస్టిక్ బుట్ట లాంటిది తీసుకోవాలి. రవ్వలను జల్లించే జల్లెడ కూడా పనిచేస్తుంది
ప్లాస్టిక్ బుట్టలో ధనియాలను అంతటా పరచుకునేలా వెయ్యాలి. తర్వాత ధనియాలు మునిగేలా నీరు నింపాలి. మరీ ఎక్కువ పోస్తే గిన్నెలోంచీ నీరు కిందకు పడిపోతాయి. అలా జరగకుండా సరిపడా పొయ్యాలి.
ధనియాలపై టిష్యూ పేపర్, లేదా ఏదైనా పేపర్‌ను ఉంచి తడిపి దాన్ని అలా వదిలేయాలి.
ఓ వారం తర్వాత టిష్యూ పేపర్ నీటిలో కలిసిపోయినట్టు అవుతుంది. ధనియాల నుంచి కొత్తిమీర మొలకలు వస్తాయి.
25 రోజులకు కొత్తిమీర పెరుగుతుంది.
40 రోజులకు బుట్ట మొత్తం కొత్తిమీరతో నిండిపోతుంది. బుట్ట కింద నీటిలో వేర్లు పెరుగుతాయి.
కొత్తిమీర ఏపుగా పెరగాలంటే ప్రతి 15 రోజులకు ఓసారి నీరు మార్చాలి. నీరు మార్చినప్పుడల్లా నీటిలో పావు చెంచా ఫెర్టిలైజర్ పొడి వెయ్యాలి. ఇలాంటిది మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో లభిస్తుంది. లేదంటే నర్సరీల్లో కూడా అమ్ముతారు.
40 రోజుల తర్వాత పైన ఉన్న ఆకులను కట్ చేసి వాడుకోవాలి. ఇలా మొత్తం మూడుసార్ల వరకూ కొత్తిమీర పెరుగుతుంది. మూడోసారి వేర్లను కట్ చేసి పూర్తిగా వాడేసుకోవాలి. మళ్లీ మరో పంట వేసుకోవాలి.