Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానికి అనుగుణంగా మహిళలు ఎంత త్వరగా తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలో కరోనా నేర్పించింది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిలదొక్కుకుని నిలబడేది మహిళలే అని ఈ సమయంలో మరోసారి రుజువయింది. హర్ స్టోరీ ద్వారా 'ఉమెన్ ఆఫ్ ది పాండమిక్ సిరీస్'లో మహిళలు ఎంతోమంది ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ఏ విధంగా కృషి చేశారో వారి అనుభవాలను వారి మాటలలోనే పంచుకున్నారు. అలాంటి వారిలో యాప్స్క్రిప్ట్ సహ వ్యవస్థాపకురాలైన శివాంగి ముద్గిల్ కూడా ఒకరు. ఆమె తన అనుభవాలను సోషల్ మీడియాతో పంచుకున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం.
2020లో నేను ఓ తల్లింగా ఉన్నందుకు చాలా సంతోషంగా గడిపాను. నా కొడుకు రెహన్తో ప్రతి రోజు ఓ కొత్త సాహసం చేశాను. అలాగే ఎన్నో నేర్చుకున్నాను... మరెన్నో నేర్పించాను.
ఇద్దరి పిల్లలనుకున్నా
కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో యాప్స్క్రిప్ట్లో నా వ్యాపారం దెబ్బతింటుందనే వాస్తవం నా ఆనందాన్ని మాయం చేసింది. అప్పుడు నేను నా కొడుకును ఎలాగైతే సంరక్షించుకున్నానో అలాగే నా వ్యాపారాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఒకే సమయంలో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు అనిపించింది. నా నవజాత శిశువును జాగ్రత్తగా చూసుకుంటూనే నా వ్యాపారంపై కూడా దృష్టి పెట్టడానికి సమయం కేటాయించాను. ఇటు బాబును అటు వ్యాపారం రెండింటితో ఎంతో బిజీగా గడిపేదాన్ని. సాయంత్రమయ్యే సరికి బాగా అలసిపోయేదాన్ని. చివరకు నా గురించి నేను పట్టించుకోవడానికి శక్తి మిగిలేది కాదు. అందుకే నేను చేయగలిగిన పనుల రోజు వారి జాబితా తయారు చేసుకునేదాన్ని. అయినప్పటికీ విపరీతంగా వచ్చే ఫోన్ కాల్స్ అన్నింటినీ చూడలేకపోయనాను. అలాగే కొన్ని సమయాల్లో స్కైప్ సమావేశాలనకు నాయకత్వం వహించలేక పోయాను. దాంతో కొంత నిరాశపడ్డాను.
సమతుల్యం అంత సులభం కాదు
నేను దేన్నీ వదలదలచుకోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా నా పనిని నేను చేసుకునేదాన్ని. మాతృత్వంతో వృత్తిని సమతుల్యం చేసుకోవడం అంత సులభమైన పని కాదు. కానీ కష్టపడకపోతే రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని పొందడం కుదరదు. అందుకే కష్టపడాలి. ముఖ్యంగా మీ అందమైన, అసంపూర్ణ, ఉత్తేజకరమైన, సాహసోపేత ప్రయాణాన్ని ఆలింగనం చేసుకోండి. అన్నింటికంటే జీవితం అంటే ఏమిటి? మీకు తెలుసా? మంచి విషయాలకు సమయం పడుతుంది. అందుకే నాకూ కొంత సమయం పట్టింది. ప్రతిదీ తిరిగి దాని స్థానంలో నిలబడానికి చాలా శ్రమించాను. బహుశా నేను పట్టుదలతో పని చేయడమే దీనికి కారణం కావొచ్చు. పెద్దలు చెప్పినట్టు ప్రతి సమస్యకు ఓ పరిష్కారం కచ్చితంగా ఉంటుంది. వాటిని ఎదకడమే మనం చేయాల్సినది.
లాభాలు ఉద్యోగులకే...
వ్యవస్థాపకులు రాహుల్ శర్మ, నేను ఓ సంవత్సరం మొత్తం జీతం తీసుకోలేదు. కంపెన్నీ కోసం శ్రమించిన ఉద్యోగులను నిరంతరం ప్రోత్సహించాము. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన లాభాలను ఉత్తమ ఉద్యోగులకు పంపిణీ చేసాము. ఇంట్లోనే ఉంటూ కుటుంబం సభ్యులకు దగ్గరగా ఉంటూ పని చేయడం వల్ల సిబ్బంది మరింత ఉత్సాహంగా పని చేశారు. తమ స్వగ్రామంలో ఉండడంతో జీవన వ్యయం కూడా తగ్గింది. దాంతో ఎక్కువ డబ్బును ఆదా చేసుకోగలిగారు.
ఎన్నో నేర్పింది
మహమ్మారి కచ్చితంగా మనం ఎంత త్వరగా మార్పులకు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోగలమో కచ్చితంగా నేర్పింది. మహమ్మారి నెలల్లోనే చాలా మంది ప్రజలు తమ జీవితాలను భిన్నంగా జీవించడానికి సర్దుబాటు చేసుకున్నారో, వారు ఎలా పనిచేశారో, ఎలా నేర్చుకున్నారో, ఇతరులతో ఎలా సంభాషించారో, వారు తమ సమయాన్ని ఎలా గడిపారో, వారు తమ జీవితాలను ఎలా గడిపారో.. అనేవి ఆశ్చర్యకరమైన విషయాలు.
ఉద్యోగులకే ప్రాధాన్యం
కోవిడ్-19 యాప్స్క్రిప్ట్లో మాకు సవాలుగా వచ్చింది. ఎందుకంటే మేము కంపెనీలో కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. దాని కోసం మా శ్రామిక శక్తిని మరింత విస్తరించుకున్నాము. పెరుగుతున్న కేసులతో అందరితో పాటు మేము కూడా ఇంటి నుండి పని విధానాన్ని అమలు చేయాల్సి వచ్చింది. ప్రజలు కూడా తమ స్వగ్రామాలకు వెళ్లి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపని చేయాల్సి వచ్చింది. చాలా కంపెనీలు జీతాలు తగ్గించి, వారి ఉద్యోగులను తొలగిస్తున్నప్పుడు, మా ఉద్యోగులకు మానసికంగా, ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని మేము స్పష్టంగా నిర్ణయించుకున్నాము. గడువులోపు ఉత్పత్తులు తీసుకు రావడానికి సహకరించిన సిబ్బందికి బోనస్లు ఇవ్వాలనుకున్నాం. అలాగే ఈ సమయంలో మరిన్ని బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహకాలను కూడా జోడించాము.
- శివాంగి ముద్గిల్
- సలీమ