Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో కొంత మందికి కాల్షియం సరిపడా ఉండదు. ఫలితంగా రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో బ్యాక్ పెయిన్ ఒకటి. దీన్నే మనం వెన్ను నొప్పి అంటాం. 25 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు. అయితే కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక... వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కాల్షియం సమస్య తీరుతుంది. అలాగే సింపుల్ చిట్కాలతో వెన్ను నొప్పి కూడా మాయం అవుతుంది. అవేంటో చూద్దాం...
ఆవనూనెలో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చెయ్యాలి. ఆ నూనె చల్లారిన తర్వాత నడుము, వీపు, మెడ వెనక భాగంలో నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ సమస్య తొలగుతుంది.
ఉప్పు కలిపిన నీటితో కూడా ఈ సమస్యను తీర్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నీటిని వేడి చెయ్యాలి. తర్వాత ఉప్పు వెయ్యాలి. ఇలా చేశాక ఓ టవల్‌ను నీటిలో ముంచాలి. ఈ గోరు వెచ్చటి టవల్‌తో వెన్నుపై అదుముకోవాలి. తద్వారా రిలీఫ్ లభిస్తుంది.
ఓ ప్యాన్‌లో రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి వేడి చెయ్యాలి. అది కాస్త చల్లారాక ఓ టవల్‌పై చల్లి దాన్ని నొప్పి వస్తున్న దగ్గర చుట్టూ కట్టుకోవాలి. కొంత సేపటి తర్వాత కంఫర్ట్‌గా ఉంటుంది.
వంగి కూర్చోవద్దు. కుర్చీలో కూర్చున్నప్పుడు వంగి కూర్చుంటే భారమంతా వెన్నుపూసపై పడుతుంది. దాంతో నడుం నొప్పి వస్తుంది. కాబట్టి నిఠారుగా, తిన్నగా కూర్చోవాలి. అలాగని బిగుసుకుపోయినట్టు కూర్చోకూడదు. ఫ్రీగానే కూర్చోవాలి. ఇలాచేస్తే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది.
ఇదివరకు ఏవైనా ప్రమాదాలు జరిగితే వాటి వల్ల కూడా ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత మందికి ఉదయం నిద్ర లేవగానే అది ఉంటుంది. పాత గాయం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి.
ఒకే విధంగా ఎక్కువ సేపు కూర్చోవద్దు. పని మధ్యలో అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకోవాలి. మీ బాడీకి చిన్నపాటి రెస్ట్ ఇవ్వాలి. తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండేలా చూసుకోవాలి. మంచి ద్రవాలు తాగాలి.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవారికి ఇలాంటి నొప్పులు రావు. ఇప్పటికే నొప్పి ఉన్నవారు కూడా మెల్లగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే నొప్పి మెల్లగా తగ్గిపోతుంది.
గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా వ్యాయామం చెయ్యాలి.