Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం నివసించే ఇల్లు ఎంత అందంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మనం ఇంటిని పదే పదే అలంకరించుకుంటాము. వస్తువులన్నీ ఓ చోట నుండి మరొక చోటికి మార్చి అందంగా ఉండేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ఈ వేసవిలో మన ఇంటిని అతి తక్కువ ఖర్చుతో అందంగా రూపొందించుకోవాలని అనుకుంటున్నారా...? తక్కువ డబ్బుతోనే మనలోని క్రియేటివిటీతో ఇంటిని మరింత అందంగా నిర్మించుకోవచ్చు. కాస్త బుర్రకు పని చెబితే వచ్చే ప్రతి ఆలోచనా సరి కొత్తగా ఉంటుంది. ఈ వేసవిలో మన ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ఐడియాస్ ఇక్కడ ఇస్తున్నారు. వాటికి మరిన్ని మెరుగులు అద్ది మీ ఇంటిని కళాత్మకంగా మలచుకోండి...
ఇంట్లో పూలు ఉంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. పైగా ఇల్లంతా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రంగు రంగుల పూల కుండీలు పెట్టుకుంటే ఇల్లు చూసేందుకు చాలా బాగుంటుంది. ఇల్లు అందంగా తీర్చిదిద్దుకోవాలనుకునే వారు ముందు పూల కుండీలకు ప్రాధాన్యం ఇస్తు మంచిది. ఇంట్లో అక్కడ అక్కడ పూల కుండీలని పెట్టండి. దానితో మీ ఇంటికి మంచి రూపు వస్తుంది. అలానే ఇంట్లోకి అందరి దష్టి పడే వస్తువులని కొనుగోలు చేయండి. అలాంటివి అందరికీ బాగా నచ్చుతాయి. ఏదైనా ఆర్ట్ వర్క్ లాంటివి పెట్టండి లేదా పెద్దగా అడ్డంగా ఉండేవి కూడా ఇట్టే ఆకట్టుకుంటాయి. కాస్త విభిన్నంగా ఉండే కుర్చీ లాంటివి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల మీ ఇల్లు ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇట్టే దానికి ఆకర్షింపబడతారు.
లైట్లు లేదా కొవ్వొత్తులు
ఇంటిని అందంగా ఉంచుకోవడానికి మంచి లైట్లు, కొవ్వొత్తులు కూడా వాడొచ్చు. వీటి వల్ల ఇల్లు అందంగా ఉండడంతో పాటు పెద్దగా కనబడుతుంది. దీనికోసం అందంగా కనిపించే లైట్లు, కొవ్వొత్తులను ఎంపిక చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్‌గా ఉండే లైట్లను, క్యాండిల్స్‌ను వాడండి. దీంతో ఇల్లు చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. ఇంటికి వచ్చే అతిధులు ఫిదా అయి పోతారు.
డార్క్ కుషన్ కవర్స్‌ని వాడండి
ఇంట్లో వాడే కుషన్స్కి కవర్స్ తొలగాలంటే డార్క్‌గా, బ్రైట్‌గా ఉండేవి ఎంచుకోండి. మనం సాధారణంగా దివాన్ వాటి మీద కుషన్స్‌ని వాడుతూ వుంటాము. చాలా మంది సోఫా మీద కూడా వేస్తూ ఉంటారు. అటువంటప్పుడు చెక్కకి సూటయ్యే లాగా కొంచెం డార్క్‌గా ఉండే వాటిని ఎంచుకోవడం మంచిది. కాబట్టి ఈసారి మంచి బ్రైట్‌గా ఉండే కుషన్ కవర్స్‌ని ఎంపిక చేయండి. దీనితో మీ ఇల్లు అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది.
స్వయంగా చేసిన వాల్ ఆర్ట్
చాలా మందికి మంచి క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి. కావాలంటే మీ స్మార్ట్ ఫోన్ సహాయంతో కూడా మీరు వాల్ ఆర్ట్స్‌ని సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు. అలాంటివి ఉపయోగిస్తే ఇల్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏది ఏమైనా స్వయంగా మన చేతులతో తయారు చేసుకున్నవే వస్తువైనా ఎంతో బాగుంటుంది. పైగా కాస్త డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. దీని కోసం డబ్బులు కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకో వచ్చు. కొన్ని కొన్ని సార్లు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో పనికి రావని పక్కన పడేసిన సామాన్లతో కూడా ఎంతో బాగా వాల్ ఆర్ట్స్ లాంటివి తయారు చేయవచ్చు. ఖాళిగా ఉన్న సమయంలో కాస్త సమయాన్ని దీని కోసం వెచ్చించండి. దీనితో మీరు అందంగా మీ ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి వీలవుతుంది. కలర్ పేపర్స్, పిస్తా షెల్స్ ఇలా వివిధ రకాల వాటితో కూడా వీటిని తయారు చేయొచ్చు. మీ ఇంటి గోడల రంగును బట్టి వీటిని డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడు ఇల్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాదు దీంతో మీ క్రియేటివిటీని కూడా పెంపొందించుకోవడానికి వీలవుతుంది. ఎప్పుడో ఉపయోగించిన మీ క్రియేటివిటీకి మళ్లీ పదును పెట్టొచ్చు. ఖాళీ సమయంలో ఇలాంటివి చేయడం వల్ల బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇలా కాసేపు గడపడం వల్ల ఆనందంగా కూడా ఉంటుంది.