Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుదీనా జ్యూస్ రోడ్లపై అమ్ముతుంటారు. బయటి కంటే ఇంట్లో మనమే సొంతంగా తయారుచేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి జ్యూస్ తాగితే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీన్ని కూలింగ్ లేకుండా తాగితే ఎంతో మంచిది. అందుకే వీలైనంతవరకూ కూలింగ్ లేకుండా చూసుకోండి. ఎండలో పనిచేసి బాగా అలసిపోయిన వారు ఈ నిమ్మ, పుదీనా జ్యూస్ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.
తయారీ విధానం: లెమన్ డ్రింక్ (లిమ్కా లేదా స్ప్రైట్) 500ఎం.ఎల్ బాటిల్ - 1, తాజా పుదీనా ఆకులు - ఒక కప్పు, తాజా నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు లేదా ఒక పెద్ద నిమ్మకాయ నుంచి వచ్చిన జ్యూస్, ఉప్పు - కొద్దిగా.
తయారీ విధానం: పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇందుకోసం కొద్దిగా నీరు పోసినా పర్వాలేదు. ఆ తర్వాత మరో అరకప్పు నీరు పోసి మరో 10 సెకండ్లపాటూ మిక్సీలో బ్లెండ్ చెయ్యాలి. దీన్ని వడగట్టి ఆ వచ్చిన రసాన్ని ఫ్రిజ్లో ఉంచాలి. ఎప్పుడు తాగాలనుకుంటారో అప్పుడు పుదీనా రసాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీసి అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఐస్ ముక్కలు బయటకు తీసి ముక్కలు చేసి... రెండు పొడవాటి గ్లాసుల్లో వెయ్యాలి. తర్వాత పుదీనా రసాన్ని రెండు గ్లాసుల్లో సమానంగా పొయ్యాలి. ఇప్పుడు లిమ్కా లేదా స్ప్రైట్ డ్రింకును ఆ జ్యూస్లో కలిపి వెంటనే తాగండి.
ఈ పుదీనా జ్యూస్ తయారుచేసుకోవడం చాలా తేలిక. బాగా దాహం వేసినప్పుడు ఇది వెంటనే దప్పిక తీర్చుతుంది. వేసవిలో చాలా మంది ఈ జ్యూస్ తాగుతుంటారు. బయట ఎండ పెరిగేకొద్దీ. ఇది రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. ఎంతో ఆరోగ్యకరం. అయితే పైన చెప్పినట్లు ఎక్కువ కూలింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.