Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 సమాచారాన్ని పంచు కోవడం కోసం మన హైదరాబాద్‌కు చెందిన యువతి వెన్సీ కృష్ణ తయారు చేసిన నో-కోడ్ అనే యాప్ కేవలం రెండు గంటల వ్యవధిలోనే రూపొందిం చబడింది. అంతేకాదు ఐదు రోజుల్లో రెండు లక్షల మంది వద్దకు ఈ యాప్ చేరుకుంది. హైడ్కోవిడ్రోర్సెస్.కామ్ పేరుతో ఇది తయారు చేయబడింది. హైదరాబాద్‌లోని అన్ని చోట్లకు కోవిడ్-19 సంబంధిత సమాచారం ఒకేసారి సులభంగా చేరవేయగల వేదిక ఇది. ఆమె తయారు చేసిన ఆ యాప్ వివరాలు ఏంటో మనమూ తెలుసుకుందాం...
కోవిడ్-19 రెండవ దశలో తీవ్రంగా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో దేశ వ్యాప్తంగా ఎంతో మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆస్పత్రుల చుట్టూ తిరిగి
వెన్సీ కృష్ణ ఇంటికి కూడా ఈ వైరస్ దెబ్బ తాకింది. ఆమె తల్లి కరోనా బారిన పడినప్పుడు నగరంలోని ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఆమెను చేర్చుకునేందుకు ఎక్కడా పడకలు ఖాళీగా లేవు. కానీ వెన్సీ తల్లి పరిస్థితి భయంకరంగా ఉంది. ఎలాగా ఆమె తల్లి ఇంటి వద్ద నుండే వైద్యం తీసుకుని వైరస్ బారి నుండి కోలుకోగలిగారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో టెక్నాలజీ రంగంలో దూసుకుపోయిన వెన్సీ నగరంలోని అన్ని కోవిడ్-19 సెంటర్లపై తన దృష్టిని ఉంచింది.
రెండు గంటల్లోనే...
@glideapps ఉపయోగించి వెన్సీ ఏప్రిల్ 20న కేవలం రెండు గంటల్లో నో-కోడ్ ప్లాట్‌ఫాం hydcovidresources.com డిజైన్ చేసి అదే రోజు మధ్యాహ్నం ప్రారంభించింది. మొదటి 12 గంటల్లో ఈ యాప్ 10,000 మంది వినియోగదారుల వద్దకు చేరుకుంది. ఐదు రోజులకు దాని వినియోగదారులు రెండు లక్షలకు పెరిగిపోయారు. ఎవ్వరైనా ఎంతో సులభంగా ఉపయోగించుకునేలా ఆమె దీన్ని రూపొందించింది.
అన్నీ ఒకే ప్లాట్‌ఫాంలో...
hydcovidresources.com కరోనా బారినపడ్డవారి వివిధ అవసరాలను తీరుస్తుంది. ఆక్సిజన్, ప్లాస్మా, రెమ్‌డెసివిర్, అంబులెన్స్‌లు, భోజన సేవలు, బ్లూక్ బ్యాంకులు.. ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. వెన్సీ తన స్నేహితులు మేధా కద్రి, అభిషేక్ అనిరుధన్లతో కలిసి ఈ పనిచేస్తుంది. అలాగే 30 మంది స్వచ్ఛంద సేవకుల బృందం వివిధ ప్లాట్‌ఫాంల నుండి సహాయం కోరి వారికి అవసరమైన సదుపాయాలు సమకూర్చడం, వారికి తగిన సమాచారం ఇవ్వడం వంటివి చేస్తున్నారు. వెన్సీ, అభిషేక్‌లు యాప్ నిర్వహణ పనులు చేస్తుండగా మేధా వాలంటీర్లకు బాధ్యత వహిస్తుంది.
మేమెలా నిద్రపోగలం
''గత వారం రోజులుగా మా బృందానికి అసలు నిద్రే లేదు. ప్రస్తుతం వస్తున్న కేసుల సంఖ్యను చూసినప్పుడు మేము చేస్తున్న పని చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు కూడా సరైన సమయానికి అందించలేకపోతున్నాం. సహాయకులు చాలా మంది అవసరం. కరోనా వైరస్ సమస్యను రిష్కరించడానికి ప్రభుత్వానికి కూడా మేము సహాయం చేయాలనుకుంటున్నాం. దేశం ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉంటే మేము ఎలా నిద్రపోగలము'' అని వెన్సీ అంటుంది.
వెంటనే సహాయం
ఈ యాప్‌ను ఉపయోగించే పద్ధతి అందరికీ తెలియాలి. మరింత అభివృద్ధి చెంచాలి. ఇతరుల అవసరం లేకుండా అందరూ స్వయంగా దీన్ని వాడగలగాలి. అప్పుడు అసరమైన సహాయం వెంటనే చేరవేయగలుగుతాం. సమస్య కూడా త్వరంగా పరిష్కరించబడుతుంది. ఈ యాప్ ప్రారంభించిన మూడో రోజు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో hydcovidresources.com గురించి సమాచారాన్ని పంచుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. ''వీరందరి మద్దతుకు మేము కృతజ్ఞులం. ఇతర నగరాల్లో కూడా ఎక్కువ మంది మా మోడల్ ద్వారా ప్రభావితమవుతారని ఆశిస్తున్నా'' అని వెన్సీ అంటుంది.
అభ్యుదయ వెబ్ యాప్
నా స్నేహితురాలు మేధా... ఏప్రిల్ 19న హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న కరోనా సెంటర్ల జాబితా తయారు చేయడానికి ఓ స్ప్రెడ్‌షీట్ ప్రారంభించింది. నేను కూడా ఆమె ప్రయత్నానికి సహకరించాను. దానిని ఓ పద్ధతిలో తీసుకెళ్ళడానికి ఓ యాప్ అవసరమని నిర్ణయించుకున్నాను. ఇది ఒక అభ్యుదయ వెబ్ యాప్. అంటే మీరు దీన్ని ఉపయోగించాలంటే దేన్నీ డౌన్లోడ్ చేయనవసరం లేదు. మీ బ్రౌజర్ నుండి మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్లో లోడ్ చేయవచ్చు. మీ హోమ్ స్క్రీన్కు కూడా దీన్ని పిన్ చేయవచ్చు. కనీసం మీ డేటాను కూడా మాకు ఇవ్వవలసిన అవసరం లేదు.
- వెన్సీ కృష్ణ