Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో చల్లని పానీయాలను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. బలాన్ని ఇచ్చే పాలు, పండ్లతో ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని ఈ వేసవిని ఎంజారు చేయవచ్చు. బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చల్లగా సర్వ్ చేయచ్చు. అయితే ప్రస్తుం కరోనా కారణంగా మరీ ఎక్కువ సార్లు వీటిని తీసుకోకపోవడమే మంచిది.
పైనాపిల్ మిల్క్ షేక్
కావల్సిన పదార్థాలు: పైనాపిల్ - ఒకటి, పాలు - రెండు కప్పులు, పంచదార - అర కప్పు, వెన్నీల ఐస్ క్రీం - టేబుల్ స్పూను, ఐస్ క్యూబ్స్ - రెండు, యాలకుల పొడి - టీ స్పూను.
తయారు చేసే విధానం: పైనాపిల్పై తొక్కును తీసివేసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి. తర్వాత రెండు కప్పుల పైనాపిల్ రసానికి, రెండు కప్పుల పాలు, చక్కెర కలిపి మళ్లీ మిక్సీలో వేయాలి. దానిని ఓ గ్లాస్లో పోసి అందులో వెన్నీల ఐస్ క్రీం, ఐస్ క్యూబ్స్ యాలకుల పొడిని కలిపి కొంచెం సేపు ఫ్రిజ్లో పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత తాగితే వేసవి దాహం చక్కగా తీరుతుంది.
మిల్క్ ఫ్రూట్స్ సలాడ్
కావల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు - పది, పాలు - ఒక కప్పు, తేనె - పావు కప్పు, నల్ల ద్రాక్ష పండ్లు - కొన్ని, అరటిపండ్ల ముక్కలు - అర కప్పు, గ్రీన్ యాపిల్ ముక్కలు - పది, యాపిల్ ముక్కలు - పది, పంచదార - అర కప్పు, ఐస్ క్రీం - అర కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న గిన్నెలో పాలను పోసి చిక్కగా అయ్యేంత వరకు మరిగించి తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. తర్వాత పండ్ల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. దీనిలో ఐస్క్రీము వేసి కలిపి ఫ్రిజ్లో ఒక గంటసేపు పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిజ్లోనుంచి ముక్కలు తీసి తేనే వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి....
స్ట్రాబెర్రీ మిల్క్ షేక్
కావల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ పొడి - రెండు టేబుల్ స్పూన్లు, చల్లటిపాలు - రెండు కప్పులు, స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్ - నాలుగు స్పూన్లు, పంచదార - రుచికి తగినంత, తాజా స్ట్రాబెర్రీలు - ఆరు.
తయారు చేసే విధానం: ముందుగా స్ట్రాబెర్రీలను కడగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత జార్లో పాలు, స్ట్రాబెర్రీ పొడి, స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్, పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. తరువాత గ్లాసుల్లోకి పోసి, స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.
రోజ్ మిల్క్ షేక్
కావల్సిన పదార్థాలు: రోజ్ సిరప్ - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, చక్కెర - ఒక కప్పు, క్రీం - ఒక కప్పు, గుడ్డు - ఒకటి, రోజ్ పెటల్స్ - కొన్ని.
తయారు చేసే విధానం: ముందుగా కాచి చల్లార్చిన పాలు ఓ గిన్నెలోకి తీసుకుని అందులో క్రీం, చక్కెర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్డు సొనతో, రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో గంటసేపు పెట్టాలి. ఇప్పుడు పొడవాటి గాజు గ్లాసు తీసుకుని అందులో రోజ్ మిల్క్ షేక్ పైన రోజ్ పెటల్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి...