Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సలాడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. మనం తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఎందుకంటే వాటి ద్వారా బోలెడన్ని పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా వేసవిలో సలాడ్లు తప్పనిసరి చేసుకోవాలి. తద్వారా శరీరం నీటితో ఉంటుంది. ఎండాకాలం రాగానే మనం కంటిన్యూగా నీరు తాగుతూ ఉంటాం. కానీ నీరు ఒక్కటే సరిపోదు. వాతావరణంలో వేడి కారణంగా మన బాడీలోని చాలా పోషకాలు బయటకు పోతాయి. వాటిని మనం తిరిగి భర్తీ చెయ్యడానికి సలాడ్లు తీసుకోవాలి. సలాడ్లలో ఫైబర్ ఉంటుంది. అది మనం బరువు పెరగకుండా చేస్తుంది. అందువల్ల మనం సమ్మర్లో సలాడ్ల వల్ల ఆరోగ్యంగా ఉంటాం. సలాడ్లలో ఫ్రూట్ సలాడ్లు, కూరగాయల సలాడ్లు, మిక్స్డ్ సలాడ్లు ఉంటాయి.
- మన శరీరంలో రక్తం, గ్లూకోజ్ వంటివి ఎలాగైతే సరిపడా ఉండాలో అలాగే నీరు కూడా కచ్చితంగా ఉండాలి. ఈ నీరు సరిపడా లేకపోతే డీ-హైడ్రేషన్ సమస్య వస్తుంది. కండ్లు తిరిగి పడిపోతాం. వడదెబ్బ తగులుతుంది. చర్మం ఎండిపోతుంది. బ్రెయిన్ దెబ్బతింటుంది. ఇలా చాలా సమస్యలొస్తాయి. అందుకే ఇలా జరగకుండా సలాడ్లు తినాలి. వాటిలో పోషకాల వల్ల ఎనర్జీ వచ్చి, రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. అలసట పోతుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- బాడీలో అవయవాలన్నీ సరిగా పనిచెయ్యాలంటే రక్త సరఫరా సరిగా ఉండాలి. అలా ఉండాలంటే సలాడ్లు తినాలి. ఇవి బాడీలోని చెడు వ్యర్థాలు, విషాలను బయటకు పంపేస్తాయి. ఇలా సలాడ్లు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.
- మనకు ఫైబర్ చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా మంది ఫ్రైరు ఎక్కువగా తింటుంటే వారికి ఫైబర్ సమస్య వస్తోంది. మలబద్ధకం వేధిస్తోంది. తిన్న ఆహారం అరగట్లేదు. పొట్టలో పేగులకు నూనె పదార్థాలు అతుక్కుపోయి అల్సర్లు, ఏసీడీటీల వంటివి వస్తున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సలాడ్లు తినాలి. వాటిలో వుండే ఫైబర్ పొట్టంతా క్లీన్ చేస్తుంది. చెడు కొవ్వును కరిగించేస్తుంది.
- పండ్లు మనకు ఆరోగ్యకరం. వేసవిలో ద్రాక్ష, జామ, మామిడి, అరటి, దానిమ్మ, పుచ్చకాయ, కర్బూజ, యాపిల్, బొప్పాయి వంటి చాలా పండ్లు లభిస్తాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని అన్నీ కొద్దికొద్దిగా తీసుకొని సలాడ్‌లా చేసుకొని తినాలి. ఇలా రోజూ చేస్తే ఇక మందులతో పని ఉండదు. మందుల వల్ల వచ్చే పోషకాలన్నీ ఇవే ఇచ్చేస్తాయి.
- కూరగాయలతోనూ సలాడ్లు చేసుకోవచ్చు. ఉల్లి గడ్డ, టమాటా ముక్కలు, బఠాణీలు, కీర దోసకాయలు, మొలకలు వంటి వాటితో సలాడ్లు చేసుకొని తింటే ఎంతో ఎనర్జీ వస్తుంది. రోజంతా చెలాకీగా ఉంటారు.
- పండ్ల సలాడ్లలో బాదం పప్పులు, పల్లీలు, మొలకలు, బఠాణీల వంటివి మిక్స్ చేసుకోవచ్చు. తద్వారా మరింత ఆరోగ్యం.
- మొక్కజొన్న, ఆవకాడో సలాడ్ జీర్ణక్రియను బాగా పెంచుతుంది. అందువల్ల వారానికి ఒకసారైన ఇలాంటి సలాడ్ చేసుకుంటే మంచిదే. మందులు వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. వాటి బదులు సలాడ్లు వాడితే మరింత ఆరోగ్యం.