Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టొమాటోలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలినీయం అనే యాంటీఆక్సీడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే పెదాలకు టొమాటో గుజ్జు లేదా రసం పూయడం వల్ల అవి తమ సహజ రంగును కోల్పోకుండా ఉంటాయి. ప్రతిరోజు చెంచా తేనె తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే రాత్రుళ్లు పెదాలకు తేనె రాసుకుని మర్నాడు కడిగివేయాలి. తేనెలోని యాంటీ ఆక్సీడెంట్లు, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పెదాలపై ఉండే నలుపుదనాన్ని పోగొడతాయి.