Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరైన జీవనశైలిని అనుసరించకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా సంతానోత్పత్తిని కాపాడుకోవడం అవసరం. సమతుల్య ఆహారం తీసుకుంటున్నారా, తగినంత నిద్రపోతున్నారా, వ్యాయామం చేస్తున్నారా అని చూడటం ముఖ్యం. పోషకాలతో కూడిన ఆహారం లేకపోవడం, బరువు పెరగడం, వ్యాయామం లేకపోవడం, శారీరక, మానసిక ఒత్తిడి, పర్యావరణం, వ్యసనాలు, మత్తు పదార్థాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని అంశాలు. ఊబకాయం కూడా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చాలామంది ఊబకాయం ఉన్న మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్)తో బాధపడుతున్నారు.
బరువు తగ్గడం వల్ల అండోత్పత్తి, గర్భం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. పొగాకు ఉత్పత్తులు, ధూమపానం స్పెర్మ్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ప్రతిరోజూ ధూమపానం చేసే మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో గర్భస్రావం, శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. 35 సంవత్సరాల వయసు తర్వాత గర్భం, ఎండోమెట్రియోసిస్, అకాల అండాశయ వైఫల్యం స్త్రీ సంతానోత్పత్తిని తగ్గిస్తాయి.
ఏం చేయాలి?: నిపుణుల సలహా తీసుకోవాలి. చికిత్స గురించి వైద్యుడిని సంప్రదించండి. అలాగే రోజూ వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచడం వల్ల అండోత్పత్తి, సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి. రాత్రి తగినంత నిద్ర పోయేందుకు కూడా ప్రయత్నించండి. నిద్ర కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. అధిక ఫైబర్ ఆహారం, ఆకుకూరలు తినాలి. ట్రాన్స్ ఫ్యాటీ, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర తీసుకోవడం తగ్గించండి. డాక్టర్ సలహా ప్రకారం ఫోలిక్ యాసిడ్, విటమిన్ 'ఇ', 'డి', ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి. యోగా వంటివి చేస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.ప