Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే కరోనా కాలం. ఏ దగ్గు ఏ అనారోగ్యాన్ని సూచిస్తుందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే మీకు వచ్చే దగ్గు ఎలాంటిదైనా సరే దాన్ని భరించడం చాలా కష్టం. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, చాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా దగ్గును వదిలించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం...
- దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు పూటల గ్లాసు పాలల్లో కాస్త అల్లం లేదా వెల్లులి వేసి మరిగించండి. ఆ తర్వాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది.
- పసుపులో కుర్క్యుమిన్ అనే పదార్థం వైరస్, బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గిస్తుంది. అల్లం, వెల్లుల్లి టాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బడను తగ్గించి సహజ నొప్పి నివారుణుల్లా పనిచేస్తాయి.
దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే రోజూ ఉదయాన్నే రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగండి.
- తిప్పతీగ రసం రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
- తేనె, దాల్చిన చెక్క పొడి నీటిలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- తేనెలో ఉండే డెక్స్ట్రో మెథోర్ఫాన్ దగ్గును తగ్గిస్తుంది.
- దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి లేదా అర చెంచా, నల్ల మిరియాల పొడిని నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తినండి.
- దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- వేడి వేడి మసాలా టీ తాగినా దగ్గు తగ్గుతుంది.