Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. అలాగే శుభ్రత మీద ధ్యాస పెరిగింది. చేతులు సబ్బుతో కడుక్కోవడం, భౌతికదూరం, మాస్క్ పెట్టుకోవడం వంటివి సాధారణమయ్యాయి. అయినా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. అందుకే ఫుడ్ సేఫ్టీ ఇప్పుడు మన ప్రయారిటీగా మారిపోయింది. అందులో ఒకటి కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడం.
గ్యాస్ స్టవ్: గ్యాస్ స్టవ్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్కి అదే మొదటి కారణమవుతుంది. స్టవ్‌ని రోజుకి రెండు సార్లు క్లీన్ చేయమని నిపుణులు చెబుతున్నారు. సోప్ వాటర్‌తో క్లీన్ చేస్తే ఇంకా మంచిది.
కిచెన్ కౌంటర్స్: మార్కెట్ నుండి తీసుకొచ్చిన పండ్లూ, కూరగాయలూ కడిగే ముందు కిచెన్ కౌంటర్ మీదే పెడతాం. అందుకే వాటిని పెట్టే ముందూ కౌంటర్ క్లీన్ చేయాలి. అలాగే చాపింగ్ బోర్డ్‌ని కూడా ఎప్పటికప్పుడు ఉప్పూ, నిమ్మ రసం కలిపిన నీటితో క్లీన్ చేయాలి.
పండ్లూ, కూరగాయలు: మార్కెట్ నుండి తెచ్చిన పండ్లూ కూరగాయలను చేతితో రుద్దుతూ రన్నింగ్ వాటర్ కింద కడగాలి. దుంపల్ని వెజిటబుల్ బ్రష్‌తో క్లీన్ చేస్తే మంచిది. ఒక్కొక్కటిగా కడగలేని వాటిని కొలాండర్లో వేసి రన్నింగ్ వాటర్ కింద చేత్తో తిప్పుతూ కడగాలి. ఆకు కూరల్ని చల్లని నీటిలో ఉంచాలి. క్యాబేజ్‌కి పైన రెండు మూడు ఆకులు తీసేసి పేపర్ టవల్‌తో తుడవాలి
కంటెయినర్స్: పప్పులూ, పంచదార, గోధుమ పిండి వంటివి స్టోర్ చేసే కంటెయినర్లు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కసారి వీటి అడుగున పురుగులు ఉంటాయి. మనం చూసుకోకుండా కొత్త సరుకు అందులో వేసేస్తే దానికి కూడా పురుగు పడుతుంది. అందుకే ఈ డబ్బాల్లో ఉన్న సరుకు అయిపోగానే సోప్ వాటర్‌తో కడిగి ఆరబెట్టి అప్పుడు కొత్త సరుకు నింపుకుంటే ఈ ప్రాబ్లమ్ రాదు.
ఎక్విప్మెంట్: బ్లెండర్స్, మిక్సర్స్, మైక్రోవేవ్స్, ఓవెన్స్, గ్రిల్ల్స్, టోస్టర్స్.. ఏవైనా సరే చాలా క్లీన్‌గా ఉండాలి. లేకపోతే వీటిలో ఫంగస్ చేరుతుంది. మిక్సీ జార్స్‌లో తడి ఉండకుండా జాగ్రత్తగా ఆరబెట్టి ఉంచాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ కిచెన్, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు.