Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
- ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
- నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.
- తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
- కొబ్బరి నూనెతో చర్మమంతా వారానికి ఒకసారి మర్ధన చేసుకోవాలి.
- కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.
- టీ స్పూన్ కీరా జ్యూస్లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి.
- ఎక్కువసార్లు మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
- నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ చర్మాన్ని కాపాడుతుంది.