Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో కాటన్ ధరిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఇవి చమటను పీల్చుకుని శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే ఎక్కువ మంది ఎండా కాలం వచ్చిందంటే కాటన్ బట్టలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దుస్తుల్లో ఎన్ని మోడల్స్ ఉన్నప్పటికీ చీరకున్న హూందాతనం దేనికీ రాదు అనేది నిజం. అందుకే కాటన్ చీరలకు ఎండకాలంలో డిమాండ్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో కాటన్లోనే ఎన్నో రకాల డిజైన్లు వస్తున్నాయి. పార్టీలకు, పంక్షన్లకు కూడా వేసుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు. అలాంటి కొత్త కొత్త డిజైన్లలో మీ మనసుకు నచ్చినవి.. మీ ఒంటికి నప్పేవి ఎంపిక చేసుకోండి. ఈ వేసవిని ఆహ్లాదంగా గడిపేయండి.