Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిస్మిస్ పండ్లలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందువలన దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్లను రక్షిస్తుంది. ఎండు ద్రాక్షలో పాలీఫినాలిక్ పైటో న్యూట్రియంట్స్ ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరొటిన్, కెరొటనాయిడ్స్ కండ్లకు ఎంతో మేలు చేస్తాయి.
కిస్మిస్లో ఉన్న ప్రక్టోజ్, గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువుని పెంచే దిశగా శక్తి మూలకముగా పని చేస్తుంది. తక్కువ బరువు కలవారు ఎండుద్రాక్షను తింటే మంచిది.
కిస్మిస్లో ఫైబర్ పుష్కలంగా ఉన్నందు వలన విరోచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది.
కిస్మిస్ పండ్లను తరచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది.
200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.