Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలోవెరా అద్భుత మొక్క. ఇది ఇంట్లోని గాలిని క్లీన్ చేసేస్తుంది. గాలిలోని విషపూరిత వాయువులన్నింటినీ లాగేసుకుంటుంది. ఈ రోజుల్లో చాలా సబ్బులు, షాంపూలు, స్కిన్ ప్రొడక్ట్స్‌లో అలోవెరాను బాగా వాడుతున్నారు. అందువల్ల మీరు కూడా ఓ అలోవెరా మొక్క తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటూ అప్పుడప్పుడూ దాని ఆకును తెంపి ఇలా వాడుకోండి.
- అలోవెరాను తలకు పెట్టుకుంటే మంచిది. ఇది జుట్టుకు మాస్కులా పనిచేస్తుంది. ఇందుకోసం అలోవెరా ఆకును కట్ చేసి అందులోని గుజ్జును స్పూన్‌తో వేరు చేసి దాన్ని ఓ గిన్నెలో వేసుకోవాలి. దానికి ఓ టీ స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ పేస్టును జుట్టుపై రాసుకోవాలి. కుదుళ్లకు బాగా అంటుకునేలా చెయ్యాలి. ఓ పది నిమిషాల తర్వాత తల స్నానం చెయ్యాలి. తలపై ఉన్న చుండ్రు పూర్తిగా పోతుంది. దాంతో జుట్టు బాగా పెరుగుతుంది.
- ఎండ వల్ల చర్మం కందిపోతూ ఉంటే చర్మానికి అలోవెరా గుజ్జును రాసుకోవచ్చు. ఇది చల్లగా ఉంటుంది. చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే చాలా సన్ బర్న్ ఉత్పత్తుల్లో అలోవెరాను వాడుతారు.
- ముఖంపై మచ్చలు, మొటిమలు ఉంటే ముఖమంతా అలోవెరా గుజ్జు రాసేసుకోవాలి. దాంతో ఇందులోని మినరల్స్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమల అంతు చూస్తాయి. ఓ పావు గంట తర్వాత నీటితో కడిగేసుకోవచ్చు. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను ఓ గిన్నెలో వేసి కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించండి. ఇదో అద్భుతమైన ఫేస్‌మాస్క్‌లా పనిచేస్తుంది.
- గాయాలను నయం చేయడంలో అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడైనా కందినా, గాయమైనా, కోసుకున్నా, చర్మం చిట్లినా, అక్కడ అలోవెరా రాసేయాలి. చిన్న చిన్న గాయాలు కూడా దీనితో త్వరగా నయం అవుతాయి. మీకు ఇది పేస్టులా కావాలంటే గుజ్జును మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యవచ్చు.
- సున్నితమైన చర్మం ఉండేవారికి మేకర్ రిమూవర్ సరైనది లభించదు. అందుకే వాటి కోసం వెతకకుండా దూదితో అలోవెరా గుజ్జును ముఖంపై మెల్లగా మసాజ్ చేసుకోవాలి. అంతే ఈజీగా మేకప్ పోతుంది.
- అలోవెరా గుజ్జులో కొద్దిగా తినేసోడా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుస్తుంది.
- అలోవెరా మౌత్ వాష్‌గా కూడా పనిచేస్తుందని 2014లో ఇథియోపియా జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో రాసిన అధ్యయనం తెలిపింది. ఇందులో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది చిగుళ్లలో పాచిని పోగొడుతుంది. చిగుళ్ల గాయాలను కూడా తగ్గిస్తుది. అలోవెరా గుజ్జును నీటిలో కలిపి నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసేయాలి. తద్వారా నోరు శుభ్రం అవుతుంది.