Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి అడుగుపెట్టగానే దానితో పాటు సీజన్‌గా వచ్చే మామిడి పండ్లు, ముంజకాయలు, పనస పండ్లు దర్శనమిస్తాయి. చలువచేసే పుచ్చకాయ, తర్బూజాలు వుంటాయి. పనస పండు ఆరోగ్యపరంగా చేసే మేలు అంతాఇంతా కాదు. పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.