Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో 200 రకాల వైరస్లు ఉండగా... వాటిలో ఒకటి కరోనా వైరస్. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేవారు దీన్ని జయిస్తున్నారు. మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఏం తాగాలి అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిపి ఓ లిస్టు తయారు చేశారు. సాధ్యమైనంత వరకు వాటిని తింటూ ఉంటే కరోనా వైరస్ వ్యాపించినా మనకు తెలియకుండానే అది చచ్చిపోయే అవకాశం ఉంది. బాడీలోని ఇమ్యూనిటీ పవర్ దాన్ని ఎదిరించగలదు. అందుకే ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 98 మంది వైరస్‌ని జయిస్తున్నారు. కారణం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లే. మరి ఆ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం.
- టమాటాలు, క్యారెట్, బీట్రూట్, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, వంకాయ, కాప్సికం తినాలి.
- కమలాలు, పైనాపిల్, బొప్పాయి, కివి, జామకాయ, బెర్రీస్ ఈ పండ్లుతింటే మంచిది. ఇవి కాకుండా మరిన్ని రకాల పండ్లు తిన్నా మంచిదే.
- బాదం(రాత్రంతా నీటిలో నానబెట్టినవి), వాల్నట్స్.
- గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం, వెల్లుల్లి, పసుపు టీ.
- రోజూ 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. (సాధారణ మంచినీరు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, ఇంట్లో తయారుచేసుకున్న విటమిన్ సీ ఫ్రూట్ జ్యూస్‌లు, పాలు, మజ్జిగ వంటివి ఏవైనా తాగొచ్చు)
పైన చెప్పిన ఫుడ్‌ని మీ డైట్లో చేర్చుకుంటే కరోనా వైరస్ మీ జోలికి వచ్చే అవకాశాలు 99 శాతం ఉండవంటున్నారు డాక్టర్లు. కాబ్టటి ఈ లిస్ట్‌ని రోజూ ఫాలో అవుతూ సంతులిత ఆహారం తీసుకుంటే కరోనా అంతు చూడొచ్చు.