Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడిగా ఉంటుంది. పిల్లల అల్లరి సరే దానితో సమానంగా పెద్దలు పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరమట. లల్లాయి పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటు, ఇటు ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది అంటున్నారు ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు.
ర పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని తారంగం తారంగం అంటూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వాళ్ళ ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో ''సెన్సరీ వ్యవస్థ'' చక్కగా బలపడుతోందని, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు.
ర పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లి బిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద ''ఫ్లోరిడా అట్లాంటిక్ యునివర్సిటీ'' పరిశోధకులు ఇటీవల విస్తృతంగా పరిశోధనలు చేసారు. అ పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కులుగుతోందని తేలింది.
ర చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషాపరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుగ్గా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్ధం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన అటా పాటా బాగా ఉపకరిస్తాయి అంటున్నారు ఈ పరిశోధన చేసిన ''లుకోవిట్జ్''.
ర పిల్లల్ని ఒకచోట ఉంచి రకరకాల బొమ్మల్ని చూపిస్తూ అడించే దాని కన్నా, ఒక బొమ్మగా ఆడించి, ఊపుతూ కదపటం, వారు కిలకిల నవ్వేలా చేయటం వంటివి తప్పకుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. అటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ అడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు.