Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్మం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లోనుంచి బయటకు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల తంటాలు పడుతుంటారు. అంతేకాదు.. ఈ మొటిమలు తగ్గిన చోట వాటి మచ్చలు అలాగే వుండిపోతాయి. అలాంటప్పుడు ఈ మొటిమల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే..
- ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుసుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే వుంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా తరుచుగా చేసుకుంటే.. మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెపుతున్నారు.
- ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి అనంతరం దాంట్లో కొంచెం తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.
- ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లు తదితరాలు ఒక పాత్రలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయని వారు చెపుతున్నారు. ప