Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు ఆఫీసు పనులలో నిమగమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోతోంది. ఇటు కుటుంబాన్ని అటు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా వృత్తి జీవితంలో ముందుకు సాగిపోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందాం..
ప్రైవేటు కంపెనీలలో పనిచేసే మహిళలు కూడా ప్రాజెక్ట్‌కు తగ్గట్టుగానే ఆఫీసులోనే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. అంతేకాదు.. ఒకవేళ ఆఫీసు పనిలో ఏవైనా బ్యాలెన్స్ వుంటే, వాటిని రాత్రులవరకు మేలుకొని ఇళ్లల్లో పూర్తి చేస్తున్నారు. దీంతోవారు తమ వ్యక్తిగత జీవితాన్ని అనుభవించలేక అటు ఇంట్లో వున్నవారితో సమయాన్ని కేటాయించలేక, ఆఫీసు పనుల ఒత్తిడితో తీరిక లేకుండా జీవిస్తున్నారు. ఉదయం లేచిన మొదలు రాత్రి చీకటి పడిన తర్వాత కూడా ఆఫీసులకే పరిమితమయిపోతున్నారు. ఇంట్లోవాళ్లతో కలిసి కొద్దిసేపు సమయాన్ని సరదాగా గడపడానికి గాని, లేదా ఎక్కడికైనా బయటకు వెళ్లడానికి అస్సలు కుదరడం నేటి సమాజంలో పనిచేస్తున్న మహిళలకు. అటువంటి సమయంలో కొన్ని ప్రణాళికబద్దమైన చిట్కాలను అవలంబించుకుంటే చాలు.. మీరు మీ ఆఫీసు పనులతోపాటు, ఇంట్లోవారితో కూడా హాయిగా సమయాన్ని కేటాయించుకోవచ్చు.
పనులు కేటాయించండి
మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు దానిపైనే దష్టి సారించండి. ఆఫీసు పనులను తొందరగా పూర్తి చేసుకుంటే, ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. అలాగే ఇంట్లో వున్న పనులు, బాధ్యతలు మీరొక్కరే తీసుకోకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
ఒకదాని తర్వాత...
మొదటగా మీరు పూర్తి చేయాల్సిన పనులను పూర్తి చేయకముందే ఇతర బాధ్యతలను తీసుకోవడం వల్ల.. రెండింటినీ న్యాయాన్ని చేకూర్చలేరు. ఒకవేళ ఇలా చేయాల్సి వస్తే.. మీరు వ్యక్తిగత జీవితంలో పొందాల్సిన సంతోషాన్ని ఒక్కసారిగా కోల్పోతారు.
సమయాన్ని వృధా చేయవద్దు
మీరు మీ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఒక పనిని ఎంచుకోవాలి. అంటే ఆఫీసులో మీరు చేస్తున్న పనిమీదే దష్టిని కేంద్రీకరించాలి. మీరు ఆఫీసులో ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడకుండా సమయాన్ని వధా చేసుకోకూడదు. అంతేకాదు.. ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు తెగ వాడేస్తుంటారు. అయితే పని మధ్యలో వీటిని ఉపయోగించకూడదు. మధ్యమధ్యలో 10 నిముషాల వరకు విరామం తీసుకుంటే చాలా మంచిది. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.
మీ పని తర్వాతే ఏదైనా
మీరు పనిచేస్తున్న సమయంలో మీ కోలీగ్స్ గాని, మరేవరైనా గాని ఇతర పనులు అప్పగించినప్పుడు నిస్సందేహంగా వాటిని తిరస్కించండి. ముందు మీ పని ముగిసిన తర్వాతే ఇతరుల పనిని కూడా మీరు సమర్థవంతంగా నిర్వర్తించుకోవచ్చు.
ప్రణాళికాబద్ధంగా....
మీరు చేసే పర్ఫెక్ట్గా ఇతర ఆలోచనలు లేకుండా నిర్వర్తించుకోవాలి. అప్పుడే మీరు విజయాన్ని సాధించగలరు. అలా అని ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించుకోకూడదు. ప్రణాళికబద్ధంగా ఆఫీసు పనులను నిర్వర్తించుకుని వాటిని సాధ్యమైనంతవరకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కుటుంబసభ్యులతో కేటాయించుకోవడానికి వీలుగా వుంటుంది.
ఏది అవసరమో అదే
మీరు ఏదైనా ఒక పని చేయలేరు అనుకుంటే వాటిని అప్పుడే వదిలేయాలి. అనవసరంగా ఆలోచించి సమయాన్ని వథా చేసుకోకూడదు. ముందు ఏది అవసరం అయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు నిర్ణయించుకున్న సమయంలో ఆఫీసు పనులు పూర్తి కాకపోతే.. తర్వాతి రోజు వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మిగతా వాటి గురించి ఆలోచించుకోవాలి.
ఈ విధంగా మీరు ప్రణాళికలను పాటించుకుంటే.. ఆఫీసు పనులతోపాటు ఇంటివారితో కూడా సమయాన్ని హాయిగా గడపవచ్చు.