Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు నిత్యం వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, గొంతులో మంట, గొంతు గరగరలు.. ఇలా రకరకాల వ్యాధులు వేధిస్తుంటాయి. ఈ విధమైన సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
గొంతు సమస్యలకు చెక్ పెట్టే రెమెడీల్లో ఃవేడి వేడి సూప్ః ఎంతో శ్రేయస్కరం. మాంసాహారులైతే చికెన్ సూప్ లేదంటే మెంతులూ, పెసలూ కలిపి చేసిన సూప్‌లు ట్రై చేయవచ్చు. చిక్కగా, వేడిగా ఉండే సూప్‌ల వల్ల గొంతులో గరగర మటుమాయమవుతుంది. గొంతు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు క్యారెట్‌ని తురిమి బాగా ఉడికించి, ఆ గుజ్జును వేడిగా తినాలి. ఈ విధంగా తీసుకోవడం వలన గొంతుకు సాంత్వన లభిస్తుంది. క్యారెట్లో పీచు పదార్థాలు, పొటాషియం, సి, కె విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి క్యారెట్ సూప్ తీసుకోవడాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎంతో మంచిది.
ఒకవేళ గొంతులో నొప్పి, మంట ఎక్కువగా వుంటే అప్పుడు ఓట్స్ నీళ్లలో ఉడికించి, వేడి వేడిగా తీసుకోవాలి. తద్వారా ఆకలి తీరడంతోపాటు అందులో ఉన్న పీచూ, ఫొలేట్లూ, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలూ శరీరానికి అందుతాయి. ఓట్స్ మాత్రమే ఉడికించి తినలేని వాళ్లు అందులో అరటి పండు గుజ్జూ, తేనె వంటివి కలిపి కూడా తీసుకోవచ్చు.
వేడి వేడి గ్రీన్ టీలో తేనె కలిపి తీసుకుంటే గొంతుకు చాలా మంచిది. తేనెలోని పోషకాలు గొంతులో చేరిన ఇన్ ఫెక్షన్లతో పోరాడతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప