Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దని మానసిక నిపుణులు అంటున్నారు. ఒత్తిడితో చిరాగ్గా ఉంటే ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉంటే మంచిది కాదు. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు ఆరోగ్యంతో ఉండాలి. ఇందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని అలవాటుగా చేసుకోవడం మంచిది. అందుకే ఎప్పటికప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి. గందరగోళ పరిస్థితిని దూరం చేసుకోవడం మంచిది. అదే దీర్ఘకాలంలో ఒత్తిడిగా మారుతుంది. అలా కాకుండా రేపు చేయాల్సిన పనులేంటో ముందే ఆలోచించుకోండి. ఉదయం పూట కంగారు ఉండదు. ఒత్తిడిగానూ అనిపించదు. ఇలా ప్రణాళిక ఉండటం వల్ల ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుంది. తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్టు అనిపిస్తాయి. కాబట్టి అన్నివేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒత్తిడిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచీ సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థం అవుతుంది. దాన్ని బట్టి సమస్య నుంచి తద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులువవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా విడివిడి భాగాలుగా చేసి చూస్తే పరిష్కారం సులభమవుతుందంటారు సైకాలజిస్టులు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం.
మానసికోల్లాసాన్ని కలిగించే అభిరుచులకు పదును పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. సృజనాత్మకత ఉన్న ఏ పని అయినా ఒత్తిడి నుంచి బయటపడేయడానికి సహకరిస్తుంది. మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడం (సంగీతం లాంటి హాబీల వల్ల) ఒక పాజిటివ్ దృష్టికోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. అసిడిటీ పోతుంది. హార్మోన్లు సమతులం అవుతాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పటి బాధ రేపు ఉండదు. ఎక్కువ కాలం ఉండే మన జీవితాన్ని కష్టమయం చేసుకోవడం ఎందుకు. ఇలాంటి లాజిక్లు సమస్యను స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.
- జీవితంలో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అది వృధానే. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. ఒత్తిడి వల్ల నాలుగు పదులు దాటగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాల్సిందే. ప