Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయిపోతే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్న వారు పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ చిట్కాల గురించి తెలుసుకోండి.
కార్బో హైడ్రేట్లను తగ్గించటం: కార్బోహైడ్రేట్లు, ఫాట్స్ బరువు పెరడానికి దోహదం చేస్తాయి. అందుకని వీటి మోతాదును తగ్గించి ప్రొటీన్‌తో కూడిన ఆహారాన్ని పెంచాలి. పాలల్లో ప్రొటీన్ పొడి వేసుకుని తాగినా సరే. ప్రొటీన్ షేక్స్ అయినా ఓకే. వీటివల్ల కడుపు నిండినట్టు ఉంటుంది.
కేలరీలను కరిగించాలి: రోజువారీ శారీరక వ్యాయామాన్ని మించింది లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కదలకుండా కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలా అయితే ఆరోగ్యానికి మహా ముప్పే. శారీరక వ్యాయామం చేయమన్నారుగా అని వ్యాయామశాల కోసం వెతకాల్సిన పనేమీ లేదు. రోజూ నిర్ణీత సమయం పాటు వేగంగా నడిచినా సరిపోతుంది.
మెటబాలిజం రేటు: మెటబాలిజం వేగం పుంజుకుంటే మరిన్ని కేలరీలు ఖర్చయిపోతాయి. రోజువారీ వ్యాయామంతోపాటు మెటబాలిజం రేటును పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్సినియా, అకారు బెర్రీ ల్లాంటివి.
బరువును చూసుకుంటూ ఉండాలి: పై చిట్కాలు పాటించక ముందు, పాటించిన తర్వాత వచ్చిన మార్పులను గమనించాలి. ఫలితాలను బట్టి ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా? అనే విషయం స్పష్టమవుతుంది.
గుడ్డిగా ఫాలో కావొద్దు: బరువు తగ్గాలంటే చాలు... అందరూ మొదటిగా చెప్పే మాట 'డైట్ కంట్రోల్ చేయండి' అని. డైట్ కంట్రోల్ చేస్తే నిజంగానే బరువు తగ్గుతారా? పుల్కాలు, పండ్లవంటి తేలిక ఆహారం తింటే బరువు తగ్గిపోతామా? తగ్గనే తగ్గరు అంటున్నారు పరిశోధకులు. అందుకు కారణమేంటో కూడా వాళ్లే చెబుతున్నారు. అదేంటంటే... జీర్ణవ్యవస్థలో కీలకంగా పనిచేసే బ్యాక్టీరియా ఒక్కో మనిషిలో ఒక్కోరకంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలన్నా? ఇంకేదైనా సమస్య వచ్చినా... అందరూ ఒకే విధమైన ఆహారం తీసుకునే అలవాటు చేసుకుంటే సరిపోదు. ఎవరి శరీరం పనితీరుకు తగినట్టు వాళ్లు తమ డైట్‌ని ప్లాన్ చేసుకోవాలి. అందుకు వైద్యుల అవసరం తప్పనిసరి. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకుని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మీ శరీరానికి సరిపోయే సిస్టమ్‌ను డెవలప్ చేసుకోండి. ఆనందంగా బరువు తగ్గండి. ప