Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఉదయం చురుగ్గా వున్నప్పుటికీ సాయంత్రినికల్లా పూర్తిగా డీలా పడిపోతుంటారు. అలాంటప్పుడు మెదడు చురుగ్గా పనిచేయదు. విద్యర్థుల నుంచి మధ్యవయస్కులవారిదాకా ఈ తరహా సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారికోసం నిపుణులు ఓ మెరుగైన సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గ్రీన్ టీ తాగినప్పుడు మెదడులోని నాడీకణాల మధ్య సమన్వయం పెరుగుతుందని, దాంతో మెదడు చురుగ్గా ఉంటుందని తేలింది. దీనివల్ల జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బాసెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
అయితే.. గ్రీన్ టీని పరిమితిగా తాగితే మంచిదని సూచిస్తుంటారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజుకు కేవలం రెండుసార్లు తీసుకుంటే మంచిది.