Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె లక్ష్యం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే అహారం గురించి తెలుసుకునేందుకు సంబంధించిన కోర్సు చేశారు. 'అదీ ఒక చదువేనా...' అని అశ్చర్యపోయే అనేక మంది గ్రామీణ ప్రజలు తీసుకునే పోషకాల లేమి ఉన్న అహారం.. వాటి వల్ల ఎదుర్కోనే రోగాలను కూడా గుర్తించారు. వాటిపై పూర్తిగా అధ్యయనం చేశారు. ఆమే దివ్య సత్యరాజ్...
దివ్య ఎవరో కాదు బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్ కూతురు. తండ్రి నటనారంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటే తనయ కూడా తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. తల్లి మహేశ్వరి. దివ్య అన్నయ్య నిర్మాత, నటుడు సిబి. అయితే దివ్య తన తండ్రి, అన్నయ్యలా నటనపై ఆసక్తి చూపలేపదు. బదులుగా పోషకాహార వృత్తిని కొనసాగించింది. ఈమె మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి న్యూట్రిషన్లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీతో పట్టభద్రురాలయ్యింది.
లోపాన్ని గుర్తించి
'పోషకాహారం'పై ఉన్నతాభ్యాసంతో పాటు ఎన్నో పరిశోధనలూ చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన 'అక్షయ పాత్ర ఫౌండేషన్' తమ సంస్థకు ఆమెను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. నిరుపేద చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే దిశగా తన వంతు కృషి చేస్తున్నారు. భారతదేశంలో పోషకాహార లోపాన్ని గుర్తించి పేదలకు ఉచితంగా ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన భోజనం అందించేందుకు 2020లో 'మహిల్మాధి ఇయక్కం' అనే ఉద్యమాన్ని కూడా ఆమె ప్రారంభించారు.
ప్రధానిని ప్రశ్నిస్తూ...
ప్రస్తుతం దివ్య ఆరోగ్య సంబంధిత సమస్యలు, బాల కార్మికులు, మహిళలకు ఆత్మరక్షణతో పాటు శ్రీలంక శరణార్థుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో వైద్య రంగంలో జరిగిన దుష్ప్రవర్తనలు, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ అలాగే నీట్ పరీక్షలను ప్రశ్నిస్తూ ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు. అంతేకాకుండా వరల్డ్ విజన్ ఇండియాతో కూడా ఆమె భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అక్కడ ఆమె నలుగురు అమ్మాయిల బాధ్యత కూడా తీసుకున్నారు.
చదువుకునే రోజుల్లోనే...
దివ్య న్యూట్రిషన్ కోర్సులో ఎంఫిల్ చదువుతున్న సమయంలో ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలలకు వెళ్లారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి కూడా అక్కడ చిన్నారు తీసుకునే అహారాన్ని గమనించారు. వారి ఆహారంలో ఎలాంటి పోషకాలు వున్నాయి.? ఏమీ లేవు అన్న విషయాలపై కూలంకుషంగా అధ్యయనం చేశారు. దానివల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఏంటన్న వివరాలను కూడా సేకరించారు. వీటన్నింటినీ కలుపుతూ పరిశోధన చేశారామె.
ఓ ప్రాజెక్టుగా...
అంతటితో ఆగకుండా తాను చేసిన అధ్యయనాల వివరాలన్నింటినీ ఓ నివేదికగా రూపోందించి వాటిని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రికి అందించారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అందించే మధ్యాహ్న బోజనంలో ఎటువంటి పోషక విలువలు తగ్గుతున్నాయో గుర్తించిన అమె.. ఆ వివరాలన్నీంటినీ కూడా అరోగ్యశాఖ మంత్రికి అందించారు. విద్యార్థులకు, ప్రభుత్వాసుపత్రుల రోగులకు ఆహార విషయంలో, శుభ్రతలో తగిన సౌకర్యాలను అందించడం అవసరం కాబట్టి, దాన్నే ఓ ప్రాజెక్టుగా చేపట్టారు.
తండ్రికి తగిన తనయగా...
ప్రపంచవ్యాప్తంగా నిరుపేద, ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు మధ్యాహ్న భోజన అందించే సంస్థ 'అక్షయపాత్ర'తో కలిసి అమె తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ సంస్థ అందించే ఆహారంలో ఇంకా చేర్చాల్సిన పదార్థాలు, పోషకాల గురించి అమె సలహాలు ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల ఆరోగ్యం, వారిలోని పోషకాహారలేమిని గుర్తిస్తూ.. అక్కడి ప్రాంతాల పిల్లలకు అందించే అహారంలో మార్పులు తీసుకువస్తున్నారు. తండ్రి చాటు తనయగా కన్నా తండ్రిని తగిన తనయగా అమె అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.
రాజకీయాల్లోకి వస్తా
'మహిల్మాధి ఇయక్కం' ఉద్యమం గురించి ఆమె మాట్లాడుతూ ''నగరంలో పోషకాహారం, దాని ప్రయోజనాల గురించి అవగాహన లేని ప్రాంతాలను గుర్తించడం ఈ ఉద్యమం ఉద్దేశ్యం. ప్రాంతాలను గుర్తించి, సంఘ సభ్యులను అంచనా వేసిన తర్వాత, పొరుగున ఉన్నవారు అవసరమైతే, లోపాల ఆధారంగా అక్కడి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉచితంగా అందిస్తారు' అంటున్నారు. భవిష్యత్‌లో రాజకీయాల్లో రావాలనే ఆలోచన కూడా తనకు ఉన్నట్టు ఆమె అంటున్నారు.