Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో ఎండతాపం ఏమేర వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈ ఎండ దెబ్బతో ప్రతిఒక్కరు నీరసించిపోతారు. ఫలితంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తి స్థాయి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు మనిషి చురుకుదనాన్ని కోల్పోతారు. అలాంటి సమయంలో తిరిగి శక్తిని పొందాలంటే అందుకు కొన్ని ముఖ్యమైన పండ్లరసాలు వున్నాయి. అలాంటివాటిలో ఆరెంజ్, పుచ్చకాయ జ్యూస్‌లు వున్నాయి. వేసవిలో ఈ రెండూ తీసుకోవడం తప్పనిసరి, ఆరోగ్యకరమని వారంటున్నారు. ఎండతాపం వల్ల అనారోగ్యబారిన నుంచి బయటపడివేయడానికి ఈ రెండూ ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు సూచిస్తారు.
ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఆరెంజ్ జ్యూస్‌ను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్ సి, ఎలెక్ట్రోల్కెట్స్ సమద్ధిగా ఉంటాయి. ఇవి వడదెబ్బ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎంతో సహకరిస్తాయి. అలాగే ఈ జ్యూస్ నిర్జలీకరణ నుండి రక్షిస్తుంది.
ఇక పుచ్చకాయ జ్యూస్ గురించి ప్రస్తావిస్తే.. అది వేసవిలో అవసరమ్కెన అన్ని ఖనిజాలను శరీరానికి సరఫరా చేస్తుంది. పుచ్చకాయ జ్యూస్ చేయడానికి రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఈ జ్యూస్ ని ఉదయం, సాయంత్రం రోజూ తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఐస్‌తో బటర్ మిల్క్ తీసుకుంటే శరీరానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కొంత పెరుగు తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. ఈ పానీయం వేసవిలో డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
శరీరం నిర్జలీకరణకు గురి అయినప్పుడు టీ తాగితే మేలు చేస్తుంది. గ్రీన్ టీకి వేసవిలో మినహాయింపు ఉంది. వేసవిలో గ్రీన్ టీలో నిమ్మరసం కలపటం ద్వారా డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది.