Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రితు ఫోగట్.. పరిచయం అక్కర్లేని మీరు ఇది. 'దంగల్' సోదరిగా ఈ పేరు ప్రపంచానికి దగ్గరయింది. ఈమె గొప్ప మార్షల్ ఆర్టిస్ట్. 2016 కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌గా నిలిచి భారతదేశానికి బంగారు పతకం సాధించింది. ప్రస్తుతం ఈమె సింగపూర్‌లో జరుగబోతున్న టోర్నమెంట్లో పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా ఈమె స్ఫూర్తి దాయక జీవితం గురించి మరిన్ని మానవి పాఠకుల కోసం...
మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న కాలమిది. గత కొన్ని నెలలుగా మనలో చాలా మందికి ఇది తీవ్రమైన కష్టకాలం. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ చాలా మంది క్రీడాకారులు దేశం గర్వించేలా కషి చేస్తున్నారు. వారి శక్తిసామర్థ్యాలను చూపిస్తూ భారతదేశానికి ఆశా కిరణాలుగా నిలిచారు. అలాంటి వారిలో రితు ఫోగాట్ ఒకరు. ప్రస్తుతం సింగపూర్‌లో వన్ ఛాంపియన్షిప్, ఇండియాలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) టోర్నమెంట్లో ఈమె పాల్గొంటున్నారు. త్వరలో జరగబోతున్న ఈ టోర్నమెంట్ ఈమెకు అత్యంత కీలకమైనది. ఎందుకంటే రెండుసార్లు చైనీస్ ఛాంపియన్‌గా నిలిచిన చైనీస్ క్రీడాకారిణి మెంగ్ బోతోను రితూ ప్రిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రితు ఎదుర్కోబోతున్నారు.
ఫోగాట్ సోదరీమణులు
2016 కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రితు స్వర్ణం సాధించారు. ఏడేండ్ల వయసులో క్రీడలకు పరిచయం అయిన ఈమెకూ ఈమె కుటుంబానికి కుస్తీ కొత్తేమీ కాదు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో మనందరం చూశాము. గీతా, బబిత పాత్రల్లో తండ్రి ప్రోత్సాహంతో క్రీడల్లో విజయం సాధించడం మనందరం చూశాము. ఫ్రీస్టైల్ రెజ్లర్ అయిన గీతా ఫోగాట్ 2010లో కామన్వెల్త్ క్రీడలలో కుస్తీలో భారతదేశపు మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ సమ్మర్ గేమ్స్‌కు అర్హత సాధించిన మొదటి భారత మహిళా రెజ్లర్ కూడా ఆమె. రితు సోదరి బబిత ఫోగాట్ 2014 కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకాన్ని, 2012 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె కజిన్ సోదరి వినేష్ ఫోగాట్ కూడా బంగారు పతక విజేత. వీరి తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్. ఈయన మల్లయోధుడు. కుమార్తెలందరికీ ఈయనే శిక్షణ ఇచ్చాడు.
అమ్మాయిలుగా ఎంపికలు లేవు
''మేము హర్యానాలోని బాలాలి అనే చాలా చిన్న గ్రామంలో పుట్టి పెరిగాము. అమ్మాయిగా కెరీర్ పరంగా ఎంచుకోవడానికి మాకు ప్రత్యేకంగా ఎంపికలు లేవు. అయినా కుస్తీ నా జీవితంలోకి ప్రవేశించింది. ఏడు సంవత్సరాల వయసులో ఈ క్రీడలోకి అడుగుపెట్టాను. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడటం లేదు. ఎంఎంఏ నా చేతికి రాకముందు వరకు అంటే 2019 వరకు నా దేశం, రాష్ట్రం కోసం అనేక పతకాలు సాధించాను'' అంటున్నారు రితు.
దంగల్స్
సహజాతి సహజంగానే కుస్తీ రితు జీవితంలోకి వచ్చింది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లోకి రాకముందు దీని గురించి ఆమె ఆలోచించలేదు. తన సోదరీమణుల మాదిరిగానే రితు కూడా హర్యానాలోని తన గ్రామాలలో, చుట్టుపక్కల ఉన్న సాంప్రదాయ 'డాంగ్లాల్స్'(మట్టి కుస్తీ)లో శిక్షణ పొందారు. ''నేను దంగల్స్ (మడ్ రెజ్లింగ్)లో అబ్బాయిలతో కుస్తీ పడ్డాను. చాలాసార్లు గెలిచాను. మా దంగల్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మన దేశంలో. అందుకే ఇటువంటి క్రీడలో విజయం సాధించడం పట్ల చాలా గర్వంగా ఉంది. మా చిన్నతనంలో మేము చిన్న దంగల్‌లో పాల్గొనేవాళ్లం. కొన్నిసార్లు మూడు నారింజ కోసం పోటీలో పాల్గొన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పోటీలో మేము గెలిస్తే మాకు మూడు నారింజలు ఇచ్చేవారు. చిన్న తనంలో వాటిని గెలుచుకోవడం చాలా సంతోషంగా అనిపించేది'' అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.
కుస్తీని ఆమె ప్రేమిస్తుంది
కుస్తీ చేస్తున్నప్పుడు రెజ్లింగ్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, వుషు వంటి ఇతర యుద్ధ కళల గురించి ఆమె తరచుగా ఆలోచిస్తూ ఉండేది. ఒకదానితో ఒకటి పోల్చడం, క్రీడాకారుల గురించి పరిశోధన చేయడం అప్పటి నుండే మొదలుపెట్టింది. ''అవకాశం నా తలుపు తట్టినప్పుడు ఇది నాకు అవసరమా అనుకోలేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించాలనుకున్నా. నిజంగా ప్రయత్నిం చాలనుకున్నాను. నా కుటుంబంలో నేను చాలా సాహసోపేతమైనదాన్ని'' అని రితు నవ్వుతూ చెప్పారు.
కఠినమైన శిక్షణ
దంగల్ సినిమాలో చూపినట్టు తండ్రి చూపిన మార్గం, అందించిన శిక్షణే రితు విజయానికి బాటలు వేసింది. ఆమె మార్గాన్ని సుగమం చేసింది. ''నాకు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా తండ్రి నన్ను తన రెక్కల కింద తీసుకున్నాడు. మీ అందరికీ తెలిసినట్టుగా అతను చాలా కఠినంగా, క్రమశిక్షణతో ఉంటాడు. కాబట్టి మొదటి రోజు నుండే నా శిక్షణ చాలా కఠినమైనది. మేము ఉదయం 4 గంటలకు నిద్రలేచేవాళ్ళం. ఉదయం 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. తర్వాత అల్పాహారం తింటాం. ఆపై విశ్రాంతి తీసుకుంటాం. మధ్యాహ్నం మరొక తీవ్రమైన శిక్షణ మాకు ఉంటుంది. అది పూర్తి చేసిన తర్వాత రాత్రి 9 గంటలకు భోజనం పూర్తి చేసి నిద్రపోతాము. నేను నా తండ్రి శిక్షణ ఉన్నప్పుడు ఇవే నా రోజువారీ కార్యకలాపాలు. వాస్తవానికి మా తండ్రి మాకు నేర్పించిన లోతైన విలువలే క్రీడపై పూర్తి దష్టి పెట్టడానికి సహాయపడుతుంది'' అని రితు చెప్పారు.
ఆలోచనల్లో మార్పు వస్తుంది
ఓ ప్రముఖ క్రీడా కుటుంబం నుండి వచ్చినప్పటికీ రితు కూడా ఈ క్రీడా ప్రపంచంలో ఎన్నో రకాలుగా వివక్షకు గురయ్యింది. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన మహిళలకు ఇలాంటి అవకాశాలు దొరకడం చాలా కష్టం. ''అయితే ఇలాంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి నా సోదరీమణులు కుస్తీలో అంతర్జాతీయ పతకాలు సాధించారు. కాబట్టి నేను అది అంత కష్టం అని అనుకోలేదు. మన పురుషాధిక్య సమాజంలో మహిళలకు భిన్నమైన పాత్ర ఉంది. మమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తూ అదే మీ జీవితం అంటూ పెంచుతారు. అయితే ప్రస్తుతం కొంత మార్పు వచ్చింది. ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. మహిళలు అన్ని రంగాల్లో అడుగులు పెడుతున్నారు. మహిళల తమ పట్ల తమకు ఉన్న అంచనాలు కూడా మారిపోతున్నాయి'' అంటున్నారు రితు. ఈమె తన కెరీర్‌ను ప్రారంభించడానికి ముందే తన అక్కలు క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టి తన మార్గాన్ని సులవు చేశారని, సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం ఇచ్చారని ఆమె అంటున్నారు. ''చాలా అంతర్జాతీయ టోర్నమెంట్లలో నా భారతీయ మూలాల కారణంగా ప్రజలు నన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఓ ఆడపిల్ల ఏం సాధిస్తుందిలే అనుకున్నారు. కానీ వారు స్టేడియం నుండి బయటకు వెళ్ళే ముందు మహిళల గురించి వారి అభిప్రాయాలు మారిపోయాయని నేను నిర్ధారించాను'' అని రితు చెప్పారు.