Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజువారిగా నిర్వహించుకునే కార్యకలా పాలలో కొన్ని ప్రణాళిక బద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపొచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ అందమే వుండదు. అందం కోసం ప్రత్యేకంగా మేకప్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనసులో వుండే మానసిక భావాలు, ఒత్తిళ్లను చిరునవ్వుతో దూరం చేసుకుంటే చాలు.. మానసికంగా ఆరోగ్యంగా వుండటమే కాకుండా అందమైన లుక్‌ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా శాస్త్రజ్ఞులు కూడా తమ పరిశోధనల ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు. అలాగే సమయానుసారంగా రోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా శరీరాకతిని అదుపులో వుంచుకుంటూ.. శరీరంలో వున్న కొవ్వును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సహజ అందమైన చిట్కాలను మనం కూడా ఓసారి తెలుసుకుందాం...
బాధలు తొలగిపోతాయి: అమ్మాయిలకు సాధారణంగా ప్రతిక్షణం అద్దంలో చూసుకునే అలవాటు వుంటుంది. అయితే ఆ అలవాటు చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. అద్దంలో తమ అందాన్ని చూసుకుంటూ చిరునవ్వు నవ్వడం వల్ల మనసులో వున్న బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆ సమయంలోనే మీలో వున్న ఆ సంతోషకర భావాలను ఉత్తేజపరచడానికి ఎండోర్ఫిన్స్ హార్మోన్లు కూడా విడుదలవుతాయి. దీంతో మీరు సహజ అందాన్ని పొందడంతోపాటు ఆరోగ్యంగా కూడా వుండొచ్చు.
నిటారుగా కూర్చుంటే: యూరోపియన్లు గతంలో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం నిటారుగా కూర్చున్న వ్యక్తులకు మంచి అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. నిటారుగా కూర్చోవడం వల్ల శరీర వివిధ భాగాల నుంచి మెదడుకు అందాల్సిన సమాచారం వేగవంతంగా జరుగుతుంది. దాంతో వ్యక్తులు మరింత చురుకుగా పనులలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. అలాగే శరీరానికి సంబంధించిన రోగాలు కూడా దూరమవుతాయి. చర్మంలో వుండే కణాలు కూడా ఉత్తేజితమవడంతో కాంతివంతమైన చర్మాన్ని కూడా పొందుతారు.
సమయానుకూలంగా: ప్రతిరోజూ సమయాను కూలంగా యోగా చేయడం ఒక మంచి పద్ధతి. యోగా వద్ధాప్య చర్యకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. యోగాతో మన శరీరం, మనసును సమతౌల్యంగా అదుపులో చేయవచ్చు. మనసులో వున్న భావాలను బయటకు వదిలేసి తాజా శ్వాసను పీల్చడం ద్వారా ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. అది ఆరోగ్యంగా వుంచడమే కాకుండా.. అందానికి సంబంధించిన జుట్టు, చర్మం వంటి వాటిని కూడా నిర్జీవం కాకుండా శాశ్వతంగా వుంటుంది. యోగాలో పలు రకాలు కూడా వున్నాయి. అందులో ముఖ్యంగా ఓ కాలు మీద నిలబడి యోగా చేస్తే.. మంచి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
డాన్స్ చేయండి: ప్రతిఒక్కరు తమకు నచ్చిన పాట వినబడగానే అనుకోకుండా డాన్స్ చేయడం మొదలుపెట్టేస్తారు. అలా చేయడం ఎంతో ఆరోగ్యకరమని కూడా నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇలా చేయడంతో శరీరంలో వున్న అవయవాలు, ఇతర భాగాలు కదలిక చెంది నిద్రపోతున్న స్థితి నుంచి ఉత్తేజితమవుతున్నట్టుగా ఫీల్ అవుతాయి. అలాగే రక్తప్రసరణ కూడా సరైన స్థితిలో జరిగి శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అలాగే సౌందర్యానికి సంబంధించిన పోషకాలు విడుదలయి.. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి.. ప్రకాశవంతమైన చర్మాన్ని మీకు అందిస్తాయి.
ఇలా ఈ విధంగా మీరు సాధారణ ఆరోగ్య మార్గాలతో మీ శరీర అందాన్ని, ఆకతిని అదుపులో వుంచుకుంటూ.. ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చు. ప