Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖంపై మొటిమలు పోవడానికి, రాకుండా ఉండడానికి మెరిసేలా తయారవడానికి మెరిసే ముఖం కోసం ఫేస్ ప్యాక్ వాడడం
సహజం. అయితే నల్ల మినపపప్పుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. దీనికోసం మీరు నాలుగు చెంచాల మినప్పప్పు తీసుకుని, రెండు బాదం పప్పులని కలుపుని రాత్రిపూట నానబెట్టండి. ఉదయం పూట వాటిలోంచి నీటిని అంతా తీసి ఆ పప్పుని పాలల్లో కలపండి. అప్పుడు ఓ మందపాటి పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టుని ముఖంపై మెడపై బాగా వర్తించాలి. ఆ తర్వాత కొద్దిసేపటికి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయని న్యూట్రీషియన్లు అంటున్నారు.