Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు రాలకుండా ఉండటానికి గానూ, తీసుకునే ఆహారంలో కావలసిన విటమిన్ మరియు మినరల్ లు ఉండేలా చూసుకోవాలి. కావున, మీరు పాటించే ఆహార ప్రణాళికలో, పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్ మరియు హౌల్ గ్రైన్స్, తణధాన్యాలను కలుపుకోండి. విటమిన్ ఏ,బి,ఇ, ప్రోటీన్, అయోడిన్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తప్పని సరి.
8 జుట్టు కావలసిన పోషకాలను అందించే ఆయిల్‌లను రోజు వాడాలి. రెండు రోజులకు ఒకసారి జుట్టును నీటితో కడగాలి. వేడి నీరు జుట్టును ప్రమాదానికి గురి చేస్తాయి, కావున జుట్టును కడగటానికి చల్లటి నీటిని వాడండి. మరీ చల్లటి నీరు కాకుండా, గోరు వెచ్చని నీటితో కడగండి. మీ తలపై చర్మానికి ఆయిల్ లేదా స్నానం చేసే సమయంలో చేతి గోళ్ళు తాకకుండా, కేవలం వేళ్ళు మాత్రమె తాకేలా చూడండి.
8 తడిగా ఉన్న జుట్టును సహజంగా ఆరబెట్టండి. డ్రయర్ లను వాడటం వలన జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వేడితో డ్రయర్‌ను వాడి జుట్టును ఆరబెట్టడం వలన జుట్టు బలహీనంగా, అనారోగ్యంగా మారుతుంది.
8 జుట్టును దువ్వటానికి ఖాళీలు ఎక్కువగా ఉన్న దువ్వెనలను వాడండి. దువ్వెనను కూడా కింది వైపుగా దువ్వండి. జుట్టు తడిగా ఉన్నపుడు మాత్రం దువ్వకండి. త్వరగా తెగిపోయే అవకాశం ఉంది.
జుట్టుకు కండిషనర్ల వాడకం తప్పని సరే అని చెప్పవచ్చు. కండిషనర్ ను వాడటం వలన వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి క్లోరిన్ కలిగి ఉన్న నీటి నుండి మరియు హానికర సూర్యకిరణాల నుండి కాపాడుతుంది. హానికర సూర్య కిరణాల నుండి మీ జుట్టును కాపాడుకోవటానికి, రోజు క్యాప్ ను ధరించండి. కావున, కనీసం ప్రతి రెండు రోజులకు ఒకసారైన కండిషనర్ను వాడండి.