Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త సర్దుకునిపోయి నచ్చినట్టుగా ప్రవర్తిస్తే.. తప్పకుండా ఆ జ్ఞాపకాలు మధురానుభూతులుగా నిలిచిపోతాయి. ఏదైనా ఒక చిన్న విషయంలో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తితే భార్యలు కోపంగా వుండిపోతారు. వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించినప్పటకీ అంతగా సాధ్యపడదు. అప్పుడు కోపంగా వున్న భార్యను శాంతపరచాలంటే.. అందుకు కొన్ని చిట్కాలు వున్నాయి.
8 భార్య కోపంగా వుంటూ మాట్లాడకుండా ఉంటే.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చేయవచ్చు. ఇలా సర్ ప్రైజ్ గిఫ్టులు ఇవ్వడం వల్ల వాళ్లు చాలా సంతోషిస్తారని, అంతవరకు వారిలో వుండే కోపతాపం పూర్తిగా తగ్గిపోయి, శాంతంగా మారుతారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా.. ఇద్దరిలో వుండే మానసిక ఆందోళనలు తొలిగిపోయి.. ఆ క్షణాలను ఇద్దరూ ఆనందంగా గడుపుతారని వారంటున్నారు. 8 సాధారణంగా పురుషులు వివాహమైన కొన్నేండ్ల తర్వాత భార్యల ఆశయాలను పట్టించుకోరు. కానీ కెరీర్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ, తన కోరికలను ఎప్పుడూ విస్మరించవద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.
8 భార్య కోపగించుకుంటే ఆమె కోసం మొత్తం ప్రేమ ప్రతిబింబించేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కోపంగా వున్నప్పుడు ప్రేమగా వారిని బతిమిలాడితే వారు లోలోపలే సంతోషం ఫీల్ అవుతారని.. అప్పుడు వారిలో భర్తపై వున్న కోపం క్రమంగా తగ్గుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వారికి చాక్లెట్ ఇచ్చి ప్రేమగా మాట్లాడితే.. వారిలో వుండే కోపం ఇట్టే మటుమాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీ భార్య తప్పనిసరిగా మిమ్మల్ని మళ్లీ క్షమిస్తుంది. అలాగే ఆమె ద్వేషం క్రమంగా తగ్గుతుందని వారు సలహా ఇస్తున్నారు.