Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చింత చిగురు, క్యారెట్ తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ రెండింటిలోనూ రోగనిరోధక శక్తిని పెంచే పోషక విలువలు ఎక్కువ మోతాదులో వుంటాయని వారంటున్నారు. ఫలితంగా రోజంతా చురుగ్గా వుండటంతోపాటు ఆరోగ్యంగా మెలగవచ్చు.
8 పుల్లపుల్లగా ఉండే చింత చిగురులో ఫోలిక్ యాసిడ్, బీటా-కెరోటిన్ వంటి పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. అంతేకాదు.. వివిధరకాల చిరుజబ్బులను దూరం చేయడంలో అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. ఈ చిగురులో చర్మసమస్యల్ని నివారించే కొన్ని మినరల్స్ కూడా వుంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి చింతచిగురుతో తయారుచేసే ఏ వంటకమైనా వారానికి రెండుసార్లు తీసుకుంటే ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు.
8 ఇక క్యారెట్ విషయాకొస్తే ఇందులో విటమిన్ ఎ సమద్ధిగా వుంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే.. క్యారెట్లో కెరోటిన్ హెచ్చు పరిమాణంలో వుంటుంది కాబట్టి.. సాయంత్రం స్నాక్స్‌కు బదులు క్యారెట్ ముక్కల్ని తీసుకోవచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. వీటితోపాటు తాజా కాయగూరలు, పచ్చని ఆకుకూరలు, తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటే.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.