Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయిల అందం పెంచడంలో చెవి రింగులకు ప్రాధాన్యస్త్ర చాలా ఉంటుంది. అలాంటి చెవి రింగులు రోజూ ఒకటే తరహావి పెట్టుకుంటే ఏం బావుటుంది. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్‌కు తగ్గట్టు మన చెవి రింగులు ఎంపికచేసుకోవాలి. అలాంటి మోడల్స్‌లో ఒకటే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్. మోడ్రన్ గా కనిపించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పక్షి ఈకలతో తయారుచేసే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇవి మోడ్రన్ దుస్తుల మీదకి అయితే బాగా నప్పుతాయి. మామూలు చుడీదార్స్ మీదకి కూడా బావుంటాయి. కానీ... చుడీదార్స్ మీదకి ఈ రింగులు కొంచం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం... మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మోడ్రన్‌గా కనిపించండి...