Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేనెలో ఉన్న పాలీఫెనాల్స్ ఎల్డిఎల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయిని తగ్గిస్తుంది. హెచ్డిఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను మెరుగుపరుస్తుంది. ఇది ఎల్డిఎల్ ఆక్సీకరణను కూడా నిరోధించగలదు. తద్వారా రక్తంలో ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది.2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకొని దానికి 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి కలపండి. భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు 1 టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకోండి. మంచి ఫలితాల కోసం కనీసం 1-2 నెలలు దీన్ని ఆచరించండి. తేనె అధిక కొవ్వును కరిగించడమే కాదు జీర్ణక్రియను కూడా ఆరోగ్యవంతం చేస్తుంది.