Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వుల్ని రాత్రంతా నీటిలో నాబెట్టి, ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మొటిమలపై రాసి... ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేయండి... సమస్య మటుమాయమైపోతుంది. లవంగాలను పాలతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ప్రతిరోజూ రాసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటూ ఉంటే మొటిమలు పోతాయి. ఇంతకుముందే మొటిమల వల్ల పడ్డ మచ్చలేవైనా ఉంటే అవీ పోతాయి.
- తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలుపుకుని రాసుకున్నా ఫలితముంటుంది.
- ఆలూకి మొటిమల్ని తగ్గించే శక్తి ఉంది. కాబట్టి తరచూ బంగాళాదుంప రసం రాసుకుంటే మంచిది.
- పుదీనా, తులసి, వేప... ఈ మూడు ఆకులూ మొటిమలకు మంచి మందు. కాబట్టి వీటిలో ఏదో ఒక ఆకుని పేస్ట్ చేసి మొటిమలకు రాసుకుంటూ ఉండండి.
క పసుపులో నిమ్మరసం కలిపి రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమల బాధ తీరిపోతుంది. క