Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఉద్యోగస్తులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి తరుచుగా మారుతుంటారు. జీతం ఎక్కువ అవుతుందని లేదా వారి హౌదా పెద్దదిగా వుంటుందని మారుతుంటారు. అయితే ఇలా ఉద్యోగాలు మారుతుండటం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. మీరు ఏదైనా ఓ కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటే ముందుగానే ఆర్థిక విషయాలను సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రస్తుత కాలంలో ఉద్యోగస్తులందరికీ వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయి. ఆ బ్యాంకుల ఖాతాలను నేరుగా కంపెనీవారే జీరో అకౌంట్ పేరుతో అందిస్తున్నాయి. అలాగే ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరడం వల్ల అందుకు సంబంధించిన వేతనాల కోసం ఇంకొక ఖాతాను తెరవాల్సి వుంటుంది. ఇక్కడే అందరూ పప్పులో కాలు పెడుతున్నారు. వారికి ముందుగానే అందుతున్న పాత వేతన ఖాతాను రద్దు చేయకుండానే కొత్త ఖాతాను ప్రారంభించుకుంటున్నారు. ఇలా చేయడంవల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అదెలా అంటే... సహజంగా మూడునెలల పాటు వేతన ఖాతా జమ కాకపోతే వాటిని సాధారణ పొదుపు ఖాతాగా బ్యాంకులవారు మార్చేస్తారు. దీంతో జీరో అకౌంట్ ప్రయోజనం దూరమవుతుంది. అంతేకాకుండా వారికి దానికోసం అనవసర ఛార్జీలను చెల్లించాల్సి వుంటుంది.
పీఎఫ్ ఖాతా రద్దు చేసుకోండి: ఉద్యోగం మారినప్పుడు చాలామంది తమ ఈపీఎఫ్ నిధి దగ్గర అవస్థలు పడుతుంటారు. అటువంటి సమయాల్లో వారు తమ మొత్తం డబ్బును తీసేసుకుని, ఖాతాను రద్దు చేయడం చాలామంచిది. అదే కొత్త ఉద్యోగంలో మారుతున్నప్పుడు వారు పాత ఖాతాను కొత్త ఖాతాలో బదిలీ చేసుకున్నా కూడా వారికి ఆ మొత్తం లభిస్తుంది. అలాగే పన్ను విభాగాలలో కూడా జాగ్రత్తలు చూసుకోవాలి. ప్రస్తుతకాలంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ప్రణాళికలు వేసుకోవడం తప్పనిసరి. పాత సంస్థలో మీరు పనిచేస్తున్నప్పుడు అక్కడి అకౌంట్స్ విభాగానికి సమర్పించిన పన్ను ఆదా పథకాల్లో చేసిన పొదుపు వివరాలు ఒకసారి చూసుకోవడం చాలా మంచింది. దీనివల్ల అప్పటికప్పుడు మీ మూలం వద్ద కోతలు తప్పవచ్చు. మీరు ఒకవేళ పాలసీలు కడుతుంటే... వారికి మీరు మారుతున్న కొత్త ఉద్యోగం గురించి, అలాగే కొత్త బ్యాంకు ఖాతా వివరాల గురించి తెలియజేయడం శ్రేయస్కరం. దీంతో పాలసీ కట్టడంలో ఎలాంటి ఇబ్బందులు సంభవించవు.