Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, పీరియడ్స్ సక్రమంగా జరగాలన్నా, కడుపులో మంటల వంటివి పోవాలన్నా, బీపీ కంట్రోల్లో ఉండాలన్నా దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగితే మంచిది. చర్మం, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ టీ తాగితే ప్రయోజనాలు బాగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. రోజూ 120 మిల్లీగ్రాముల దాల్చిన చెక్కతో (చెక్క లేదా పౌడర్) (టీ స్పూన్లో పదో వంతు పొడి)... ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చ.
తయారుచేసే విధానం: కప్పు వేడి నీటిలో ఓ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, సరిపడా చక్కెర వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసి తాగేయడమే. లేదంటే దాల్చిన చెక్కలను వేడి నీటిలో 10 నుంచీ 15 నిమిషాలు ఉంచి ఆ నీరు తాగినా ప్రయోజనం ఉంటుంది. టీ రుచి బాగుంది కదా అని ఎక్కువ తాగడం మంచిది కాదు. ఇవి రోజుకి రెండు కంటే ఎక్కువ కప్పులు తాగకూడదు. అలా తాగితే లివర్ సరిగా పనిచెయ్యదు. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. ్ళ