Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో మనందరికీ పని ఒత్తిడి ఉంటోంది. అది కామన్ అయిపోయింది. ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటుపడ్డాం. అయితే ఏడ్చేవాళ్లుంటారే వాళ్లకు... ఈ ఒత్తిడి, టెన్షన్లు అన్నీ ఏడ్చినప్పుడు తగ్గిపోతాయట. అందువల్ల వీళ్లకు గుండె జబ్బులు, డయాబెటిస్, హైబీపీ వంటివి రావట. అందుకే ఏడ్చేవాళ్లను బలహీనులు అనుకోవద్దు. మరో విషయం ఏమిటంటే ఏడుపుకు ఆడా, మగా అనే తేడా ఉండదు.
- ఎవరికైనా ఏడుపు, నవ్వు వంటివి సహజంగా వస్తాయి. వాటిని అలాగే రానివ్వాలి తప్ప... బలవంతంగా దిగమింగుకుంటే ప్రమాదం అంటున్నారు పరిశోధకులు. నిజానికి కోపం, ఆవేశం తెచ్చుకుంటే వచ్చే అనర్థాల కంటే... ఏడుపు వల్ల వచ్చే లాభాల వల్లే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అంటున్నారు.
- బాగా ఏడుస్తారే... అంటే... సీరియల్లోనో, సినిమాల్లోనో సెంటిమెంట్ సీన్ రాగానే... కొంతమందికి కర్చీపులు తడిచిపోతాయి. ఉత్తినే ఏడుస్తారు. అలాంటి వాళ్లు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అట. వాళ్లు ఇతరుల కంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఫలితంగా వీళ్లు ఎవరినీ అంత త్వరగా వదలరు. మానవ సంబంధాలను బాగా కలిగి ఉంటారు. విపత్కర పరిస్థితులకు వీళ్లు బాగా స్పందిస్తారు.
- ఉత్తినే ఏడుస్తారే వాళ్లు మంచి స్నేహితులు అవుతారట. ఎందుకంటే వాళ్లు ఇతరులను ఇబ్బంది పెట్టలేరట. కొంత మంది ఇతరులపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. తమ మాటే నెగ్గాలని ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ల కంటే ఇలా ఏడ్చేవాళ్లే మంచి ఫ్రెండ్స్ అవుతారని పరశోధకులు తేల్చారు.
- ఫుల్ ఎమోషనల్‌గా ఉండేవారు ఇతరులు చిన్నగా బాధపడినా తట్టుకోలేరట. వారి కండ్లలో ఆనందం చూడాలని కోరుకుంటారట. కాబట్టి... ఇకపై ఎవరైనా మీ చుట్టుపక్కల ఏడుస్తున్నారనుకోండి... వారిని మంచి వాళ్లుగా గుర్తించవచ్చు. ఏడుపు అయిపోయాక... స్నేహం చెయ్యవచ్చు.