Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్నిరకాల పోషక పదార్థాలు 'మునగ'లో పుష్కలంగా వున్నాయి. విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఇందులో ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. కేవలం మునక్కాయలోనే కాదు.. మునగ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు వుంటాయి. అందుకే వాటిని వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. అయితే.. ఇలా పొడిచేసిన ఆకుల్లో సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు. వందగ్రాముల ఆకుల్లో కాల్షియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.
మునక్కాయ ఎముకల్ని బలంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం ఎముకల్ని బలపరుస్తుంది. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచుతుంది. తద్వారా డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. వీటిలోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ో