Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఉన్న మార్గాలు భౌతికదూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం. ప్రకతి సహజంగా ఆయా కాలాల్లో లభించే కొన్ని ఆహారాల్లో ఇన్ఫెక్షన్లను, ఇతర రోగాలను దూరం చేసే పోషకాలను పుష్కలంగా కలిగి వుంటాయి. వాటిని రోజూ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి.. అవేమిటో మనమూ తెలుసుకుందామా..
ప్రతి రోజు తీసుకునే టీకి బదులు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. అవి గుండె సంబంధిత వ్యాధులను దూరంగా వుంచడంతోపాటు గుండెకి మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొవ్వును దూరం చేస్తాయి. దీనిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
క రకరకాల బ్యాక్టీరియాలనూ, ఇన్ ఫెక్షన్లనూ దూరంగా ఉంచే పోషకాలు కాలీ ఫ్లవర్లో అధికం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి.. దీంతో కేవలం కూరలు చేసుకోవడం మాత్రమే కాకుండా రకరకాల వంటకాల్లో వేసుకుని తింటే చాలా మంచిదని అంటున్నారు.
వెల్లుల్లిలో కూడా రోగ నిరోదక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సల్ఫర్ పోషకాలెక్కువ. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా రాబోయేది వర్షా కాలం కాబట్టి ఆ సమయంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది. అన్ని వయసుల వారూ వెల్లుల్లిని తీసుకోవచ్చు.