Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత ఆధునిక యుగం పోటీతత్వంతో కూడినది. ఏదైనా స్థాయి సంపాదించాలంటే కొన్ని లక్షలాదిమందితో పోటీపడాల్సి వుంటుంది. అలాగే ఇంట్లో పనులను నిర్వర్తించుకోవాల్సి వుంటుంది. ఈ విధమైన వాతావరణం ప్రతిఒక్కరిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమస్య రోజురోజుకు మరింత అధికమవుతుంది. దీని నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందితే అంతే మంచిది.. లేకపోతే ఈ ఒత్తిడితో మానసిక ఆవేదన పెరిగి రకరకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి ప్రభావం మోతాదుకు మించితే అవసరమైతే పిచ్చివాళ్లు కూడా కావొచ్చునని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. దీని నుంచి విముక్తి పొందడం చాలా ముఖ్యం.
క తీవ్రమైన డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజసిద్ధమైన పద్ధతులు వున్నాయి. తప్పనిసరిగా వైద్య సంబంధమైన అవసరం ఉంటే మాత్రం అందుకు సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. ఈ మందులతోపాటు కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల ఈ ఒత్తిడి నుంచి బయటపడొచ్చని వారంటున్నారు. చాలా మందికి కాఫీ తాగే అలవాటు విపరీతంగా ఉంటుంది. కాఫీ తాగితే మూడ్‌ని బూస్ట్ చేయొచ్చని అంటుంటారు. ఇది నిజమే అయినప్పటికీ... చాలా తక్కువసేపు మాత్రమే మూడ్ బూస్ట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు కాఫీ కూడా డిప్రెషన్‌కి కూడా కారణం అవుతుంది. కాఫీ తాగడం వల్ల మెదడులోని రసాయనాలు అస్తవ్యస్తమవుతాయి. కాఫీ ప్రభావం సెరటోనిన్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకని కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. కాఫీలో ఉన్నట్టే గ్రీన్‌టీలో కూడా కెఫైన్ ఉంటుంది.
కొన్ని ఆహారపదార్థాలను తినడం వల్ల శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచుకోవచ్చు. సెరటోనిన్ డిప్రెషన్‌తో యుద్ధం చేసి దాన్ని పారిపోయేలా చేస్తుంది. ఆహారం ద్వారా సెరటోనిన్ చేరాలంటే గుడ్లు, కొబ్బరి నూనె, పుల్లటి చెర్రీలు, అవిసెగింజల నూనె, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని చెపుతుంటారు.