Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని అనుకుంటుంటారు. ఏ రంగంలోవారైనా సరే.. అందులో తమదైన విజయాన్ని సాధించాలనే తపన ప్రతిఒక్కరిలో వుంటుంది. కొంతమంది జీవితంలో ఏదీ సాధించలేక ఎల్లప్పుడూ ఓటమికి గురవుతుంటారు. అటువంటి సమయాల్లో నిరాశపడకుండా మన ఓటమికి గల కారణాలను లెక్కవేసుకోవాలి. దానిలో వున్న లోపాలను సవరించుకుని, దానికి తగ్గట్టుగా కొన్ని మంచి సలహాలను జోడించుకుంటే విజయం తప్పకుండా వరిస్తుంది. విజయానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలు మీకోసం..
చేస్తున్న ఉద్యోగాలలో మంచి విజయాలను సాధించాలంటే ముందుగా మనలో కషి, పట్టుదల, ఏకాగ్రత ఎంతో అవసరం. వాటితోపాటు సానుకూల దక్పథం, తగిన నైపుణ్యాన్ని చూపించుకోగలిగితే అందుకోనంత ఎత్తుకు సులభంగా ఎదిగిపోవచ్చు. సమయానుకూలంగా మనల్ని మనం మార్చుకుంటూ మన ఆలోచనలను గమనించుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా కొత్త విధానాలను అలవాటు చేసుకుంటూ వీలుగా మలుచుకోవాలి. అప్పుడే మనం విజయంవైపు నడవగలుగుతాము.
మీకు మీరుగానే...
ముందుగా మీరు చేస్తున్న రంగంలో మీకు మీరుగానే వుండాలి. ఇతరుల ఏదో అనుకుంటున్నారని, వారు చెప్పిన విధంగా మన జీవిన శైలిని మార్చుకోవడం అంత మంచిది కాదు. మీకు మీరుగా వుంటూ మీలో వున్న నైపుణ్యాన్ని వ్యక్తపరుచుకునేందుకు ముందుకు సాగిపోవాలి. ఇతరులు లేదా సహౌద్యోగుల మాటలు విని కష్టాలు కొని తెచ్చుకోవద్దు. మనదైన ఆలోచన దక్పథంలో ముందడుగు వేస్తేనే విజయం మన వెనకే వస్తుంది.
వైవిద్యాన్ని ప్రదర్శించండి
మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో మీరు చేస్తున్న పనిలోనే వైవిద్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేయండి. అప్పుడే మీ పేరు ఆ రంగంలో ఓ బ్రాండ్‌గా మారిపోతుంది. తమదైన ప్రత్యేకతను చూపించుకుంటూ ముందుకు సాగిపోతే.. ప్రతి ఒక్క పనిలోనూ మీ పేరే ఒక బ్రాండ్‌గా నిలిచిపోతుంది. ఇలా చేస్తే మీరు ఎందులోనైనా మంచి విజయాలను సాధిస్తారు.
లోపాలను అడిగి తెలుసుకోండి
మీరు చేస్తున్న పని ఇతరులకు నచ్చుతుందా లేదా అన్న విషయం గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ సమయాన్ని వధా చేసుకోకండి. ముందుగా ఆ పని మీకు నచ్చుతుందా? లేదా? అన్న దానిపై కేటాయించండి. ఒకవేళ మీరు చేసే పని ఎవరికైనా నచ్చకపోతే వారితోనే అందులో వున్న లోపాల గురించి అడిగి తెలుసుకోండి.. లేదా సున్నితంగా వారిని తిరస్కరించండి.. లేదా మీకై మీరే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
సహకరించే వారిని ఎంచుకోండి
మీరు చేస్తున్న పనిలో మీకేమైనా కష్టంగా అనిపిస్తే.. అందుకు మీకు సహకరించేవారిని ఎంచుకోండి. అందులో వున్న లోటుపాట్ల గురించి వారితో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాంతో మీరు ప్రశాంతంగా మీ నిధులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించుకోవచ్చు.